ఆభరణం
నమస్తే. తెలుగు సొగసు ఆన్లైన్ పత్రిక “ప్రేమికుల దినోత్సవ ప్రత్యేక సంచిక” లో నా కథ “ఆభరణం”. మీరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయం తెలుపాలని..
నమస్తే. తెలుగు సొగసు ఆన్లైన్ పత్రిక “ప్రేమికుల దినోత్సవ ప్రత్యేక సంచిక” లో నా కథ “ఆభరణం”. మీరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయం తెలుపాలని..
రేపు “వాలెంటైన్స్ డే” కదా. ప్రేమికుల దినోత్సవం. మరి ప్రేమంటే వలపా..?ఆకర్షణ..?ఒకరివెనుక ఒకరు తిరగడమా..? గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ, హోటల్స్, పార్కుల వెంట తిరగడమా..? ఆసిడ్ దాడా..? హత్యో, ఆత్మహత్యో చేసుకోవడమా..? ఏం చేస్తున్నారు ఇప్పటి ప్రేమికులు..? కానీ ప్రేమంటే కాలం ఎంత మారినా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత దూరంగా ఉన్నా అనుక్షణం నీ వెంటే నేను, నీ తోడుగా నేను, నీ నీడగా నేను, నీ సంతోషమే నేను కోరుకునేది అనే భరోసా జీవితాంతం కలిగించడం.మొత్తంగా
బాపనోళ్ళ పిల్ల…ముత్తరాసి యానాది పిలగోడు Read More »
వీధుల్లో తోపుడు బండ్లమీద, పండ్ల అంగళ్ళల్లో చూసి తృప్తి పడడమే కానీ ఆపిల్ పండు కొనుక్కుని తినే ఆర్ధిక స్తోమత నా చిన్నప్పుడు మాకు లేదు. ఆపిల్ పండు తినాలనేది నా తీరని ఆశ అప్పుడు. అయితే ఓ జనవరి ఫస్ట్ రోజు ఏం జరిగింది,ఆపిల్ పండు తినాలనే నా కోరిక తీరిందా, లేదా అనేది ఈ నెల విశాలాక్షి మాసపత్రికలో వచ్చిన ” దేవత అయిన రెడ్డెమ్మ” కథలో. సంపాదకులు శ్రీ కోసూరు రత్నం, శ్రీ
దేవత అయిన రెడ్డమ్మ Read More »
ఆరవ తరగతిలో తొలిసారి బడిలో చేరిన తొలిరోజు “యేసయ్య” గురించి తెలుసుకున్న బుజ్జమ్మ చెప్పిన కథ “తట్టుడీ మీకు టీయబడును”, ఈ నెల [డిసెంబర్] విశాలాక్షి మాసపత్రికలో. శ్రీ కోసూరి రత్నం సర్, శ్రీ ఈతకోట సుబ్బారావు సార్లకి ధన్యవాదాలతో. మిత్రులకు ముందస్తు “క్రిస్మస్” పండుగ శుభాకాంక్షలతో..🎄🎄🙏🙏 పైప్రాణాలు పైనే పోయి వొనకతా ఎనక్కి చూసినా. ఆడ మా హెడ్ మిస్సెస్ ఎలిజబెత్ టీచర్ బూట్లు టక టకలాడిస్తా చెక్క మెట్లు దిగి వస్తా ఉండాది. అప్పుటికి
తట్టుడీ మీకు తీయబడును Read More »
జీవితంలో మనిషికి ధనాత్మకంగా ఉండాల్సింది ఏమిటి ?. ఈ రోజు “విశాలాంధ్ర” ఆదివారం అనుబంధం లో నా కథ “ధనాత్మకం” ప్రచురితం అయింది. విశాలాంధ్ర సంపాదకులకు ధన్యవాదాలతో. మీరు కథను చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపుతారుగా.. మిన్ను విరిగి మీద పడినా నాకేం కాదు. ధీమా అనేది నా రక్తంలోనే ఉంది. ఇటాంటివి ఎన్ని చూడలేదు నేను. ఈ మధుసూధన్ రావు అంటే ఎవరైనా, ఏదైనా గడగడలాడాల్సిందే.అయినా దేవి ఎందుకు అంత కంగారు పడుతుంది. చిన్న
శుభోదయం. ఈ వారం సినీవాలి ఆన్లైన్ వారపత్రిక లో నేను వ్రాసిన కథ “నాన్న కోరిక” ప్రచురితం అయింది. సినీవాలి పత్రిక సంపాదకులు గౌరవనీయులు డా.శ్రీ ప్రభాకర్ జైనీ గారికి ధన్యవాదాలతో. మరి నాన్న కోరిక ఏమిటో తెలియాలంటే ఈ కథని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపగకోరుతూ… పొద్దున ఐదున్నరకే గంటకొట్టినట్టు మెలకువ వచ్చేసింది సత్యనారాయణయ్యకు. మసక మసకగా కనిపిస్తున్న ఎర్రటి బెడ్ లైట్ వెలుగులోనే తడుముకుంటూ అడుగులు వేసి ఎదురుగా గోడకు గట్టి పురికొస
ముందుగా “బహుళ” త్రైమాసిక పత్రిక సంపాదకులు, ప్రముఖ కవులు, కథా రచయిత్రి శ్రీమతి జ్వలిత Jwalitha Denchanala Jwalitha గారికి హృదయపూర్వక అభినందనలు. ప్రత్యేకంగా స్త్రీ లు ఎదుర్కొంటున్న వివక్షలు, సమస్యలు, పరిష్కారాలు, సలహాలు, చిట్కాలు,మనసుని రంజింపజేసే కథలు, కవితలు, సమీక్షలు, వ్యాసాలు తదితరాలతో రూపొందించబడిన అపురూపమైన పత్రిక “బహుళ”. సంపాదకురాలిగా ఎన్నో వ్యయ ప్రయాసలు తట్టుకుని, మరెన్నో చిత్కారాలను ఓర్పు తో సహించి పత్రికను ఎంతో ఉన్నత స్థాయిలో నిలపటానికి జ్వలిత గారి పట్టుదల, శ్రమ
నమస్తే. ఈ రోజు [31-10-2021] ప్రజాశక్తి దినపత్రిక ఆదివారం అనుబంధం “స్నేహ “లో నా కథ “కుబుసం ” ప్రచురితం అయింది. ప్రజాశక్తి సంపాదకులకు ధన్యవాదాలతో. కథను చదివి మీ అమూల్యమైన అభిప్రాయం కోరుతూ.. “వెతకండి..వెతికి పట్టుకోండి.. కొట్టండి..కొట్టి చంపేయండి” అరుపులకు మెలకువ వొచ్చేసింది నాకు.” అబ్బా..సెలవు రోజు నిద్రపోనీకుండా పొద్దునే ఈ వెర్రి అరుపులు ఏంటి” కళ్ళు నులుముకుంటూ లేచాను. “ఈయన లేచి ఉదయపు నడక కోసం వెళ్లినట్లు ఉన్నాడు ” బ్రష్ మీద పేస్ట్
ఈ నెల [అక్టోబర్ 2021 ] విశాలాక్షి మాసపత్రికలో ప్రచురితం అయిన నా కథ “ఒక బాలనాగమ్మ -నలుగురు మాయల పకీర్లు”. శ్రీ ఈతకోట సుబ్బారావు గారికి ధన్యవాదాలతో. మిత్రులకు దసరా శుభాకాంక్షలతో..దసరా కథ..🌹🌹🙏🙏కథను చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపగోరుతూ..🌹🌹🙏🙏 బడి బయట ఉండుండి తప్పేట్లు గొట్టే శబ్దం వస్తా ఉండాది.” పది రోజులు సెలవులిచ్చినారు కదా అని వీధుల్లో పడి బలాదూరుగా తిరగబాకండి. ఇంటికాడనే ఉండి సుమతి శతకాలు, వేమన పద్యాలు కంఠతా పట్టండి.
ఒక బాలనాగమ్మ..నలుగురు మాయల పకీర్లు Read More »
నమస్తే. ఈ రోజు 10-10-2021 నవ తెలంగాణ పత్రిక ఆదివారం అనుబంధం సోపతి లో నేను రాసిన కథ “క్రూకెడ్” ప్రచురితం అయింది. సోపతి సంపాదకులు కటుకోజ్వల ఆనందాచారి గారికి ధన్యవాదాలు. కథని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలని తెలుపగోరుతూ…🙏🙏🌹🌹 నిశ్శబ్దం లోనించి హృదయవిదారకంగా వినిపించిందా అరుపు. అడవిలో అప్పుడప్పుడే తల్లిచాటు నుంచి బయటకు వచ్చి ఒంటరిగా తిరగడం నేర్చుకుంటున్న లేడి కూన తొలిసారి మృగపు పంజా దెబ్బ తగిలి చిగురుటాకులా వణికిపోతోంది.తలుపు తెరుచుకుని లోపలకు వెళ్ళిన