మహారాజు
మహారాజు – ఓ మంచి తాగుబోతు. ఈ నెల కౌముది పత్రికలో ప్రచురితం అయిన నా బహుమతి కథ. సంపాదకులకు కృతఙ్ఞతలు. మహారాజు కథని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలపండి. “రేయ్ ..రవనా ..లెగరా..బారెడు పొద్దెకుండాది, రేతిరి తాగింది ఇంకా దిగినట్టులేదు ఈడీకి” అనుకుంటా రవణడిని కుదిపాడు రిక్షాసుధాకర్. మొండి గోడ కింద పగటికి రాత్రికి తేడా తెలియని సుప్తావస్థలో పడుకున్న జీవిలాగా పక్కకి పొర్లాడు రవణడు కళ్ళు మూసుకొనే.“తూ..ఎదవ నాయాలా..! నిన్ను నమ్ముకోని బంగారంటి […]