విమల సాహితి ఎడిటోరియల్స్

విమల సాహితి ఎడిటోరియల్ 18 – యుద్ధం – ఓ అంతర్గత గాయం – ఓ నెత్తుటి శకలం

సామ్రాట్ అశోకుడు ధర్మ ప్రభువు ఎప్పుడు అయినాడు? ప్రపంచ చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన ధర్మచక్రాన్ని ఎప్పుడు నిర్మించాడు? తనని నమ్ముకున్న ప్రజలకు సుభిక్షమైన సలక్షణమైన పాలనను ఎప్పుడు అందించాడు? ఒక్కసారి చరిత్రపుటల్లో తిప్పి చూస్తే 261 బి.సి. కాలంలో ఇప్పటి భారతదేశానికి చెందిన ఒడిషా రాష్ట్రము అప్పటి కళింగ ప్రాంతం. సకల కళా నైపుణ్యాలతో, విశాలమైన సంస్కృతి, ఆర్ధిక వనరులతో అలరారే “ఉత్కళ” ప్రాంతాన్నిఅశోకుని ముత్తాత చంద్ర గుప్త మౌర్యుడు దాడి చేసి ఆక్రమించడానికి విఫల ప్రయత్నం […]

విమల సాహితి ఎడిటోరియల్ 18 – యుద్ధం – ఓ అంతర్గత గాయం – ఓ నెత్తుటి శకలం Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 17 – వందే మాతరం..వందే భారతం !!

వందే భారత్ రైళ్ళు ఎవరికోసమండీ..? ఈ రోజు విమల సాహితీ పత్రికలో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ విలువైన అభిప్రాయం తెలుపండి. “బండీర పొగ బండీర.. దొరలెల్లే రైలు బండీర.. దొరసానులెల్లే బండీర” మనదేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ తెల్ల దొరలు, దొరసానులు పొగ రైలు బండ్లలో తిరుగుతుంటే, వారి భోగాన్ని చూసి మన దేశ జానపదులు పాడుకున్న పాట ఇది. వయో వృద్ధులైన కొంతమందికైనా ఈ పాట గుర్తుండే ఉంటుంది. దేశానికీ స్వాతంత్రం వచ్చి

విమల సాహితి ఎడిటోరియల్ 17 – వందే మాతరం..వందే భారతం !! Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 16 – మేధావులారా..మేల్కొనండి..

మేధావులారా ..మేల్కొనండి. ఈ వారం విమల సాహితి పత్రికలో నా సంపాదకీయం చదవండి. మీ విలువైన అభిప్రాయం తెలుపండి. మనసు లేని మనుషులు పుట్టుకొస్తున్నారు. కళ్ళు చెమ్మగిల్లడం మానేశాయి. కన్నీళ్ళు ఇంకిపోతున్నాయి. సాధించిన విజ్ఞానాన్ని నెత్తికెత్తుకుని భవిష్యత్ వైపుకు పరుగులు తీస్తూ మన సంప్రదాయాలకు తిలోదకాలిస్తున్న ఓ మహా మేధావుల్లారా..! దయచేసి మీ బిడ్డలకైనా జీవితపు విలువల గురించి కాస్త నేర్పించండి. అన్ని దేశాల సంస్కృతులు వేరు. మన దేశ సంస్కృతి వేరు. కన్న వారిని కావడిలో

విమల సాహితి ఎడిటోరియల్ 16 – మేధావులారా..మేల్కొనండి.. Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 15 – బేబీ… ఐ లవ్ యూ

Baby…..I Love You..Be Always Beautiful Yourself  బయట ఎవరితోనో కాదు. నీతో నువ్వు గాఢంగా ప్రేమతో మునిగిపో.. ఈ వారం విమల సాహితీ సంపాదకీయం. చదవండి.మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి ఆహా..! ఎంత మధురంగా ఉన్నాయి ఈ మాటలు. నవ యవ్వనపు వీణల తంత్రులన్నీ ఒక్కసారిగా కోటి రాగాలను ఆలపించినట్లు. ప్రేమికుల మధ్య ఆ తొలివలపు మధురిమలు చూస్తుంటే మనసు, తనువూ పులకరించిపోదా..! ప్రేమను పొందని బతుకెందుకు? చరిత్రలో ప్రేమకు దాసోహం అవని ఏ రాజైనా

విమల సాహితి ఎడిటోరియల్ 15 – బేబీ… ఐ లవ్ యూ Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 13 – అధునాతన ధర్మం

అధునాతన ధర్మం ఏం చెబుతోంది? ఈవారం విమల సాహితీ సంపాదకీయం. చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి “ధర్మో రక్షతి రక్షితః ” ఈ వాక్యానికి సూక్ష్మంగా “ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది” అనే అర్ధం ఉంది. ఎక్కడ ప్రజలు కలహాలు, కల్లోలాలు, విద్వేషాలు లేకుండా సంతోషంగా ఉంటారో, ఎక్కడ హింసకి తావు లేకుండా, త్యాగం, ప్రేమ, కరుణ రాజ్యమేలుతాయో అక్కడ ధర్మం నాలుగుపాదాల మీద నిలుస్తుంది అని పెద్దలు అన్నారు. మరి ఇప్పుడు

విమల సాహితి ఎడిటోరియల్ 13 – అధునాతన ధర్మం Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 12 – మసకబారుతున్న బంధాలు – మతి తప్పిన స్వార్ధం

అక్కా, చెల్లి, తల్లి, కొడుకు..ఎవరైతే ఏం. మన సుఖానికి అడ్డువస్తే ఏసైడమే. అనుబంధమా..తొక్క..ఇలా మారుతున్న మానవ సంబంధాలు. దిగజారిన నైతిక విలువలు. విమల సాహితి పత్రికలో నేను రాసిన ఎడిటోరియల్ ఆర్టికల్ చదవండి. సాధారణ పరిభాషలో కుటుంబం అంటే అమ్మ,నాన్న,అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, అవ్వ, తాత, అత్తలు, మామలు, పిన్నమ్మలు, పెద్దనాన్నలు. వీరు కాకుండా స్నేహితులు, ఇరుగు,పొరుగు. ఒక్క కుటుంబంలోనే సామాజిక బంధాలన్నీ ప్రతిఫలిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు చెదిరిపోకుండా కాపాడే దృఢమైన పునాదులు

విమల సాహితి ఎడిటోరియల్ 12 – మసకబారుతున్న బంధాలు – మతి తప్పిన స్వార్ధం Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 11 – వెలుగుతున్న దీపాలు

ఈ వారం విమల సాహితీ సంపాదకీయం. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో..వెలుగులీనుతున్న జీవన దీపాలు “మాతృదేవోభవ -పితృదేవోభవ -ఆచార్యదేవోభవ ” అన్నారు పెద్దలు. తల్లి, తండ్రి, గురువు, దైవం అని వరుసక్రమం కూడా చెప్పారు. అంటే తల్లి,తండ్రి తర్వాతి స్థానం గురువుకి ఇచ్చి, ఆ తర్వాతే దైవం అన్నారు. అంటే గురువు దైవం కంటే గొప్పవాడనే కదా అర్ధం. మనిషి జీవితంలో ఎందుకు గురువుకి అంత ఉన్నత స్థానం ఇచ్చారు అంటే గురువు అనే గొప్ప పదానికి అర్ధం

విమల సాహితి ఎడిటోరియల్ 11 – వెలుగుతున్న దీపాలు Read More »

మానవతా మూర్తులకు వందనం

ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకోగలిగే టెక్నాలజీ మనకు ఉందిప్పుడు. కానీ మనిషి మనసులో ఏముందో తెలుసుకోవడం మాత్రం అసాధ్యం. ఓవైపు సాంకేతికాభివృద్ధి పురోగమనంలో ఉంటే, మానవత్వపు విలువలు మాత్రం తిరోగమన దిశలో పాతాళంలోకి కురుకుపోతున్నాయి. ఇంతవరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న జాత్యహంకారం ఒక్కసారిగా భగ్గున మండి, దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది నిన్నటి మణిపూర్ సంఘటన. మతం రాబందు రెక్కలు విప్పుకుని అంతటా యథేచ్ఛగా తిరుగుతోంది. మనిషన్నవాడు అంతరించిపోయి విద్వేషం రాజ్యమేలుతుంటే ఇక

మానవతా మూర్తులకు వందనం Read More »

సమైక్యంగా సాధించుకున్న స్వాతంత్య్ర ఫలం చేదెక్కిందా

ఈ వారం విమల సాహితీ ఎడిటోరియల్ వ్యాసం. చదివి మీ అమూల్యమైన స్పందనను తెలుపగోరుతూ. మిత్రులందరికీ విమల సాహితీ బృందం తరపున ముందస్తు ౭౬ వ స్వతంత్రదినోత్సవ శుభాకాంక్షలతో.. ఇష్టపడి నిర్మించుకున్న సొంత ఇంట్లో “నీ బాంచన్ దొరా, నీ కాలు మొక్కుతా” అంటూ ఒకరికింద బానిసగా బతకడం ఎంత నరకమో, ఆ ఇంటివారిని అడిగితే చెప్తారు. అటువంటిది సముద్రాలు దాటి వ్యాపారం కోసం వచ్చాము అంటూ నక్క జిత్తులు చూపించి, తిన్నఇంటి వాసాలు లెక్కబెట్టి, చివరకు

సమైక్యంగా సాధించుకున్న స్వాతంత్య్ర ఫలం చేదెక్కిందా Read More »

బతకడం కోసం, బతికించడం కోసం తిందామా..!

స్పూన్ తో నా, చేత్తో నా తినేది మీరు ..? తిండి కోసం, వివక్ష కోసం బతుకుదామా..? నలుగురి ఆకలి తీర్చేదానికి బతుకుదామా..? ఈ వారం విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయం చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలపండి 🙏🌹 బతకడం కోసం, బతికించడం కోసం తిందామా..! మొత్తం జీవరాశుల్లో మానవులు వర్టిబ్రేట్స్ [వెన్నెముక గల జీవులు ] జీవ సముదాయంలో మమ్మెల్స్ [క్షీరదాలు అనగా పిల్లలకు పాలు ఇచ్చే జీవులు] జాతికి చెందినవాళ్ళం.

బతకడం కోసం, బతికించడం కోసం తిందామా..! Read More »