విమల సాహితి ఎడిటోరియల్స్

విమల సాహితి ఎడిటోరియల్ 28 – నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు

“నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు” ఈ వారం విమల సాహితీ సంపాదకీయ వ్యాసం చదివి, మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి. మిత్రులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు “ప్రయాసపడి భారము మోయుచున్న జనులారా నా వద్దకు రండి. నేను మీకు స్వస్థతను కలుగచేతును” అద్భుతమైన ఈ వాక్య సంపదను చూసారా..? ఇది సరిగ్గా నా కొరకే చెప్పబడింది అని ప్రతిఒక్కరికీ అనిపిస్తోంది కదా. నిత్య జీవితంలో మానవులు ఎన్ని రకాలుగా కష్టాలు పడుతున్నారో మనకు తెలుసు. […]

విమల సాహితి ఎడిటోరియల్ 28 – నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 27 – ఉచితం ఉచితమా..? అనుచితమా..?

” ఫ్రీ ఫ్రీ ఫ్రీ” ఫ్రీగా వస్తే ఫినాయిల్ ని అయినా వదులుకోకూడదు అని మనం సరదాగా వింటుంటాం. మరి తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. దీనిపై ఎన్నో జోకులు, సెటైర్లు, వ్యంగ్య కార్టూన్లు. ఈ అంశం గురించి ఈ రోజు విమల సాహితీ పత్రికలో నా సంపాదకీయ వ్యాసం ” ఉచితం..ఉచితమా? అనుచితమా?” చదివి, మీ అభిప్రాయాలు కూడా ఇక్కడ పంచుకోండి నేస్తాలు.. ఫ్రీ – ఫ్రీ –

విమల సాహితి ఎడిటోరియల్ 27 – ఉచితం ఉచితమా..? అనుచితమా..? Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 26 – అన్యత్వ – అనన్య

ఈనాటి విమల సాహితీ ఆన్లైన్ వారపత్రికలో నా సంపాదకీయ వ్యాసం “అన్యత్వ-అనన్య” చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి మానవ జాతి ఏర్పడడానికి లక్షల సంవత్సరాల ముందు ఈ విశ్వంలో ముందుగా జలావరణాలు ఏర్పడ్డాయి. మొట్టమొదటిసారిగా సముద్ర జలాల్లో ఎమినో ఆమ్లాల రూపంలో జీవం పుట్టుకకి అంకురార్పణ జరిగింది. భూవాతావరం జీవనానికి అనుకూలించడం ప్రారంభమైనాక కొన్ని వేల సంవత్సరాలు గడిచాక ఎన్నో జీవులు ఏర్పడి, కొంతకాలం జీవించి , ప్రకృతిలోని అసమతుల్య వాతావరణాలవల్ల ఎన్నో వందలు,వేలు జీవులు

విమల సాహితి ఎడిటోరియల్ 26 – అన్యత్వ – అనన్య Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 25 – పులిరాజాలు ఏం చేస్తున్నారు..?

“పులిరాజ” గుర్తు ఉన్నాడా మీకు? మర్చిపోయి ఉంటే ఓ సారి ఈ సంపాదకీయం చదివి గుర్తు తెచ్చుకోండి మిత్రాస్. ఆరోగ్యమే సకల భాగ్యాల సమ్మేళనం అని తెలుసుకుని అందరం ఆనందంగా జీవితం గడపాలని కోరుకుంటూఈ రోజు “విమల సాహితీ పత్రిక” ఎడిటోరియల్ వ్యాసం చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి డిసెంబర్ మాసం ఇష్టసఖి లాంటిది. చిరుజల్లులు ఒకపక్క, పిల్ల తెమ్మెరలు మరోపక్క, లేత నీరెండ ఇంకోపక్క ఒంటిని తాకుతుంటే ఎంత మానసికోల్లాసం. చామంతులు, ముద్ద బంతులు,

విమల సాహితి ఎడిటోరియల్ 25 – పులిరాజాలు ఏం చేస్తున్నారు..? Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 24 – చూపుడు వేలు ఆయుధమైన వేళ

“విమల సాహితీ ఆన్లైన్ వారపత్రికలో ఈరోజు నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి  “నాయకులకు నువ్విప్పుడు దేవుడివినీ కోసం చేస్తారు ఎన్నెన్నో ఊడిగాలునీ చుట్టూ చేస్తారు ప్రదక్షిణాలువీలైతే నిన్నెత్తుకుని ఊరేగిస్తారుమాయలో పడ్డావో నీకుండదు భవితచూపుడు వేలే ఇప్పుడు నీ వజ్రాయుధంఅనర్హులకు వేసే ఓటుఅది చేస్తుంది నీకు చేటువిజ్ఞతతో నీవు వేసే ఓటుఅది వేస్తుంది నీ ప్రగతికి పై మెట్టు” నవంబర్ మాసంలో చిరుచిరు చలిగాలులు. అయినా అటు నాయకులు, ఇటు ప్రజల మనసుల్లో

విమల సాహితి ఎడిటోరియల్ 24 – చూపుడు వేలు ఆయుధమైన వేళ Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 22 – చిన్నారి బాలల నవ్వుల పువ్వులు – నట్టింట మెరిసే దీపావళి వెలుగులు

మిత్రులకు బాలల దినోత్సవ శుభాకాంక్షల . ఈవారం విమల సాహితీ పత్రిక సంపాదకీయం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి నవంబర్ అనగానే మనకి టక్కున గుర్తుకు వచ్చే పండుగలు రెండు. ఒకటి దీపావళి, ఇంకొకటి జాతీయ బాలల దినోత్సవం. అయితే పండుగల పరమార్ధం ఏమిటి? అసలు పండుగలు ఎందుకు జరుపుకోవాలి? ఒక పక్క నిరుపేదలు తినడానికి తిండి కూడా లేక అవస్థలు పడుతుంటే, మరొక పక్క పండుగ పేరుతో పరమాన్నాలు తింటూ, విలాసాలకు డబ్బు దుబారా

విమల సాహితి ఎడిటోరియల్ 22 – చిన్నారి బాలల నవ్వుల పువ్వులు – నట్టింట మెరిసే దీపావళి వెలుగులు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 23 – “హితేన సహితం సాహిత్యం” ..ఇప్పుడంతా హితమేనా?

ఈ వారం విమల సాహితీ పత్రికలో “హితేన సహితం సాహిత్యం” లో ఇప్పుడు హితమెంత? సంపాదకీయ వ్యాసం చదివి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి 🌹🌹 కాలం బండరాయి కాదు. ఒకేచోట స్థిరంగా ఉండడానికి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్నట్లు కూడా కాదు. కాలచక్రం నిరంతర సంచారి. అలుపెరుగని బాటసారి. గమ్యం తెలియని తెరువరి. కాలంతో పాటు సమాజంలో మార్పులు కూడా సహజం. సర్వసామాన్యం. రెండు రాళ్ళను కొట్టి నిప్పును పుట్టించిన ఆదిమానవుడి నుంచి, ఆ మంటనే వాడి

విమల సాహితి ఎడిటోరియల్ 23 – “హితేన సహితం సాహిత్యం” ..ఇప్పుడంతా హితమేనా? Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 21 – సిరులెన్ని ఉన్నా చిరునవ్వు ఏది ?

“సిరులెన్ని ఉన్నా చిరునవ్వు ఏది ? ఈ వారం విమల సాహితి పత్రికలో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపండి. గేటెడ్ కమ్యూనిటీలో 3 బీకే ప్లాట్, విల్లా లాంటి పెద్ద భవంతి, పెద్ద ఉద్యోగాలు, లక్షల్లో బ్యాంకు బాలన్సు, తిరగడానికి ఖరీదైన కారు. అన్నీ ఉన్నా ముఖంలో చిరునవ్వు కరువు. సకల సౌకర్యాలు ఉన్నా, బంగారు పువ్వు వేసిన వెండి పళ్ళెంలో తినేది మాత్రం రాగి సంగటి ముద్ద, రెండంటే రెండు

విమల సాహితి ఎడిటోరియల్ 21 – సిరులెన్ని ఉన్నా చిరునవ్వు ఏది ? Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 20 – భరత్ అనే నేను

ఈవారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రికలో నేను వ్రాసిన “భరత్ అనే నేను”, సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. చెడుపైన విజయం, రజో, తమో గుణాలతో యుద్ధముచేసి సత్వగుణ సంపన్నులై జీవితాన్ని తీర్చి దిద్దుకోమని చెప్తూ వచ్చిన నవరాత్రుల దసరా పండుగ ఎన్నెన్నో సందేశాల తాయిలాలను ఇచ్చి, మళ్ళీ ఏడాది తర్వాతే కనిపిస్తాను అంటూ మొన్ననే వెళ్ళిపోయింది. మరోపక్క గాజా గడ్డమీద యుద్ధ కాండ, అమాయక పౌరులపై దమనకాండ, మతపిశాచాల మారణకాండ కొనసాగుతూనే

విమల సాహితి ఎడిటోరియల్ 20 – భరత్ అనే నేను Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 19 – ఈ విజయదశమికి ఒకసారి ఓడిపోదాం.

“ఈ విజయదశమికి ఒకసారి ఓడిపోదాం” ఈ వారం విమల సాహితీ పత్రికలో నేను రాసిన ఎడిటోరియల్ వ్యాసం. చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపండి. మిత్రులకు విజయదశమి శుభాకాంక్షలతో.. ‘గెలిస్తే ఏమొస్తుంది? మహా అయితే ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది. అదే ఓసారి ఓడిపోయి చూడు ప్రపంచం మొత్తాన్ని నువ్వు చూడవచ్చు. ప్రపంచం నిన్ను ఎలా చూస్తుందో నువ్వు తెలుసుకోవచ్చు’ అంటాడు మైఖేల్ మొనేట్ అనే ఓ మనోవైజ్ఞానిక నిపుణుడు. విజయం -అపజయం, గెలుపు – ఓటమి..! ఎంత

విమల సాహితి ఎడిటోరియల్ 19 – ఈ విజయదశమికి ఒకసారి ఓడిపోదాం. Read More »