మానవత్వపు వర్ణం

క్రింది కవిత “మానవత్వపు వర్ణంసాహిత్య ప్రస్థానం మాస పత్రికలో జనవరి 2019 లో ప్రచురితమైంది. చదివి మీ అభిప్రయాలు తెలియజేయు ప్రార్ధన.

————————————————————————————————————————–

రక్తం గ్రూపులు నాలుగేనట
ఎ.బి . ఎబి . ఓ అని
ఏ గ్రూపు రక్తం అయినా దాని వర్ణం ఎరుపేనట
ఎక్కడైనా, ఎవరైనా విశ్వదాతలు , విశ్వ గ్రహీతలు కావచ్చునట…
రక్తానికి కులం, మతం, ప్రాంతమని బేధాలు లేవట

తాను నిత్యజీవన స్రవంతిలా
జీవనదిలా యుగాలుగా మనుషుల్లో
క్షణమాత్రకాలం కూడా విరామమెరుగక ప్రవహిస్తూ
కొన ఊపిరితో ఉన్న దేహానికి ప్రాణభిక్ష పడుతుంది….
కానీ మనిషి
కులమత విద్వేషాలు పెంచుకుని,
అంతరంగాన్ని కదనరంగంగా మార్చుకుని
రుధిర తర్పణాలు విడుస్తున్నాడు….
మనలో ప్రవహించే జీవనదికి లేని బేధాలు
మనకెందుకో మరి.
యుగాలు మారినా తరాలు మారినా,
మారని మనిషి అంతరంగాన్ని మార్చే
మానవత్వపు రక్తవర్ణమా నువ్వెక్కడ, ఎక్కడ????

(మళ్లీ ఎక్కడో కులపిచ్చితో పరువు హత్య . జరిగింది అని తెలిసి ఆవేదనతో

2 thoughts on “మానవత్వపు వర్ణం”

Leave a Comment