Home Blog
విరిగిన తల. ఎవరి తల ..? ఎందుకు విరిగింది..? తెలుసుకోవాలంటే ఈ రోజు "ప్రజాశక్తి ఆదివారం అనుభందం స్నేహ పత్రిక" లో ప్రచురితం అయిన కథ "విరిగిన తల" చదవాల్సిందే. "ప్రజాశక్తి " సంపాదకులకు ధన్యవాదాలతో.. విరిగిన తల చదివి మీ విలువైన అభిప్రాయాన్ని తెలుపాలని కోరుతూ..
డుగు డుగు డుగు డుర్ డుర్.. డుర్ర్ర్..' కీ ' ఇచ్చి వదిలిన స్కూటర్ బొమ్మ ఇల్లంతా పరుగులు తీస్తోంది. బొమ్మ వెనుకే పరుగు తీస్తున్నాడు ఐదేళ్ళ చిన్నారి చైతన్య. భలే భలే అంటూ చప్పట్లు...
తెలుగు జ్యోతి పత్రిక ఏప్రిల్ నెలలో ఉగాది కవితల పోటీల్లో ఎన్నుకోబడిన నా కవిత "మమతల దారుల్లో". తెలుగు జ్యోతి పత్రిక సంపాదకులకు ధన్యవాదాలతో🌹🙏
కోటి ఆశలతో మాఇంట్లో అడుగుపెట్టిన మా కూతురు లాంటి కోడలు " సాయి సాహిత్య" కి ఈ కవిత అంకితం ప్రేమతో ❤️❤️మమతల దారుల్లో
ప్రయాణం కొత్తమజిలీకిఇదివరకెన్నడూ చూడని దారిఆశలు దీర్ఘాలైభయాలు హ్రస్వాలైముందుకు సాగే పయనంఅలుపొచ్చి ఆగిపోతే సేదదీరడానికిఅమ్మ పాడిన జోలపాటనిగుండె ఊయల్లో దాచుకుని వెళుతున్నా..బాటలో పరాకుగా అనిపిస్తేఉల్లాసం పొందడానికిచెల్లి తమ్ముడుతో పెట్టుకున్నచిలిపి తగాదాలువెన్నెల్లో కలిసి పంచుకున్న అన్నం ముద్దలువర్షంలో...
సాహితీ పెద్దలు శ్రీ విహారి గారు సృజన ప్రియ పత్రిక లో "నల్ల సూరీడు" ని వెలిగించిన అధ్బుతం. సృజయ ప్రియ సంపాదకులు శ్రీ విల్సన్ రావు కొమ్మవరపు Wilson Raoగారికి, Kommavarapu గారికి, గురువులు విహారి గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో 🙏🌹
సృజయ ప్రియ ప్రధాన సంపాదకులు, నాకు అత్యంత ప్రియ మిత్రులు శ్రీ నీలం దయానంద రాజు గారి ఆకస్మిక మరణం అత్యంత విషాదకరం. వారికి కన్నీటి నివాళులు 🙏🙏
అనుభూతి కేంద్రంగా వస్తు రూప తేజోవలయం
శ్రీమతి రోహిణి వంజారిగారు తెలుగు పత్రికా...
విద్యార్థులు విజయం సాధించాల్సింది దేనిమీద..? మే నెల "కస్తూరి మాసపత్రిక" లో నా కథ "యుద్ధం". కస్తూరి మాసపత్రిక సంపాదకులకు ధన్యవాదాలతో. "యుద్ధం " చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలుపగోరుతూ... 🙏🙏
మనం తరచుగా విజయాన్ని అకడమిక్ స్కోర్లతో సమానం చేసే ప్రపంచంలో, మార్కులు జీవితం ఒకటె అనుకునే అనాగరిక ప్రపంచంలో ఉన్నాము . రెండు విభిన్న కథనాలు నా దృష్టికి వచ్చాయి.
ఒక విద్యార్థి, 1,000కి 892 స్కోర్ను సాధించినప్పటికీ, విషాదకరంగా ఆత్మన్యూనతతో తన ప్రాణాలను తానె తీసుకున్నాడు.
మరో విద్యార్థి, 470కి కేవలం...
అడగకనే లభించిన వరం. ప్రముఖ కవి, కథకులు, విమర్శకులు, విశ్లేషకులు శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య గారి సమీక్షతో మళ్ళీ "నల్ల సూరీడు" మీ ముందుకు వెలుగులు చిమ్ముతూ వచ్చాడు. ప్రజాపక్షం పత్రిక సంపాదకులకు, శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో..
ఏప్రిల్ నెల సంచిక వెబ్ పత్రికలో డాక్టర్ కె. ఎల్. వి. ప్రసాద్ గారు నాతో జరిపిన ఇంటర్వ్యూ. నా అంతరంగంలోకి ఓ సారి చూస్తారు కదూ..సంచిక పత్రిక సంపాదకులకు, డాక్టర్ కె. ఎల్. వి. ప్రసాద్ గార్లకు ధన్యవాదాలతో..
https://sanchika.com/interview-with-mrs-rohini-vanjari/?sfw=pass1680585285
నెల్లూరులో నరసింహకొండకు వెళ్లే దారిలో లోతైన చీకటి గుహ లాంటి చోట వెలసిన ఇరగాలమ్మ.. గ్రామ దేవత. ఇరుకళల అమ్మగా మారక ముందు నేను పసితనంలో కళ్లారా చూసిన జాతర. "గంగరాయి చెట్టు కింద ఇరగాలమ్మో" కథ రూపంలో మార్చి నెల పాలపిట్టలో. గుడిపాటి వెంకట్ గారికి ధన్యవాదాలతో.."గంగరాయి చెట్టు కింద ఇరగాలమ్మో" చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపగోరుతూ..
" మొ..రవంత గొబ్బిరి చమురు చేతలో ఏస్తావా" ఇరబోసుకున్న తలను గీరుకుంటా అడిగినాది సుబ్బి."ఏం సుబ్బే..ఈ రోజు తలకుబోసుకుంటావా ఎట్టా" బియ్యంలో రాళ్ళేరతా...
"నేటి నిజం" దిన పత్రికలో "వసంత యామిని కవిత". బైస దేవదాస్ గారికి ధన్యవాదాలతో. వసంత యామిని ని చదివి మీ విలువైన అభిప్రాయాన్ని తెలపాలని కోరుకుంటూ
"ఒకానొక సాయం సంధ్య వేళగమ్యం తెలియని తెరువరిలా అడుగులు వేస్తున్నాదేహం ముందుకు కదులుతోంది భారంగామనస్సుకి మాత్రం ఏదో తెలియని అలజడిజ్ఞానేంద్రియాల్లోకి చొచ్చుకు వెళుతున్న లోకపు వింతపోకడలుగుండెను మెలితిప్పుతున్న జ్ఞాన నరాలుఎల్లెడలా అసూయా ద్వేషం జంట కవుల్లా విజృంభిస్తున్నాయికామక్రోధాలు రాబందుల జతలా ఆడదేహాలను ఛిద్రం చేస్తున్నాయిదౌర్జన్యం రాక్షసనీడలా కమ్ముకుంటోందినిరాశ నివురుగప్పిన నిప్పులా మండుతోందితామరాకుమీద నీటిబొట్టునవడం ఎలా..?మనసుకు...
మిత్రులకు సాహో అందించే మరో ఆరోగ్య కానుక. సాహూ మార్చి నెల సంచికలో "పశ్చిమోత్తాసనం" మీ కోసం
"ఆజానుబాహుడంట అమ్మలాలో" పాట వినేవుంటారు. తీరైన భుజాల ఆకృతి ఉన్నవాళ్ళకి ఇచ్చే ఒక ప్రశంస అది. ఇప్పుడు, ఈ ఊరుకులపరుగుల యుగంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరికీ ఏదో ఒక ఆరోగ్య సమస్య. పోషకాహార లోపం. ముప్పై ఏళ్లలోపే ఎముకలు అరిగిపోవడం, త్వరగా అలిసిపోవడం. మెడ, భుజాల్లో తీవ్రమైన నొప్పి. ఇక తీరైన దేహ ఆకృతి అటుంచి, చక్కని ఆరోగ్యం అందని ద్రాక్షపండే అవుతోంది ఇప్పుడు....
ఈ రోజు ప్రజాశక్తి "స్నేహ" పత్రికలో నా బాలల కథ "నాటిన విత్తులు". స్నేహ సంపాదకులకు ధన్యవాదాలతో..చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కోరుతూ..
బడి వదిలి గంట అయినా ఇంకా ఇంటికి రాని కొడుకు కోసం వాకిట్లో నిలబడి చూస్తోంది కీర్తన.ఆమె కొడుకు సుధీర్ మూడోవ తరగతి చదువుతున్నాడు. స్కూల్ ఇంటికి మూడు వీధుల అవతల ఉంది. రోజు బడి గంట కొట్టాక ఓ గంట స్కూల్ దగ్గర మిత్రులతో ఆడుకుని ఒక్కడే ఇంటికి వచ్చేసేవాడు. ఆ రోజు ఒకటిన్నర గంట అయినా రాలేదని...