తరాజు

ఈనాటి మన తెలంగాణ పత్రిక సాహితీ పేజి “మెహఫిల్” లో నా కవిత “తరాజు “ చదవండి

నువ్వు నేను-

తరతరాల తక్కెడ తరాజులో

నన్నెప్పుడో తాలుగింజలా తేల్చేసావు..

రెండు క్రోమోజోముల కలయిక నువ్వు నేను-

ఒక్క క్రోమోజము తేడాతో

నిర్మితమైన దేహాలు – నీది నాది

అంతమాత్రాన నువ్వు ధీరుడు సూరుడు కాదు

నేను బేలనో అబలనో కాదు..

పితృసామ్యం నిన్ను అధిపతిగా మలచి

నాకు బానిస ముద్ర వేసి ఉగ్గుపాలతోనే

భావ గరళం పోసింది..

కానీ ఇప్పుడు ఆ బానిసత్వానికి

కాలం తీరిపోయింది..

ఇప్పుడు నేనంటే-ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం

ఇప్పుడు నేనంటే- ఆకాంక్ష అభివృద్ధి

ఇప్పుడిక- సృష్టిలో సగం

సగం సగం కలిస్తేనే పూర్ణం..

ఇప్పుడిక- సమానత్వపు తరాజులో

నువ్వు నేను కుడి ఎడమ కాదు

తేడానే లేని మనుషులం ..

రోహిణి వంజారి

9000594630

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *