ఆవేదన

ఏ కాల సర్పం కాటేసిందో

ఏ ద్రోహం ఆవేదన పరచిందో

ఏ కష్టం కన్నీట ముంచిందో

దుఃఖం ఓపలేనిదైందో

ఏ బాధ బ్రతకవద్దందో

ఏ నిరాశ గుండెను చీల్చిందో

ఏ నిస్పృహ నిస్తేజ పరచిందో

ఏ అపజయం ఉరినెక్కమందో

ఏ ఓటమి కాటికి పొమ్మందో

ఏమో ఎవరికి తెలుసుగనుక

ఆత్మ హత్య వెనుక కథ

అశ్రు నివాళులు అర్పించకున్నా

పర్వాలేదు…

ప్రగాఢ సంతాపం తెలుపకున్నా

పర్వాలేదు…

కానీ… పోయిన వాడు

ఏ రంగువాడు ఏ కులపువాడు

ఏ మతపువాడు ఏ అంతస్తువాడు ఏ తప్పు

చేసాడో అంటూ

కాట్ల కుక్కల్లా కరవకండి

పోయిన వాడిని పొడిచి

పొడిచి చంపకండి