మకరందం

ఈ నెల[జూన్] విశాలాక్షి మాసపత్రికలో నా కవిత “మకరందం” ప్రచురితం అయింది. శ్రీ ఈత కోట సుబ్బారావు గారికి ధన్యవాదాలు. “మకరందం” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలుపండి. ఎర్ర చందనపు చెక్కలు కావుసుగంధం వెదజల్లలేవుమల్లెపూల పరిమళాలు కావుమైమరపించలేవుదేహపు విసర్జితాలన్నీ దుర్గందాలేనీలో నాలో అందరిలోకానీ ..పెదవి దాటి వచ్చే మాటొక్కటే మకరందంమాట్లాడితే మనసు తేలికవ్వాలిమాట హృదయ వీణను మీటాలికరువు నేలను వాననీటి చుక్క తడిపినట్లుమాట గుండె బరువును దింపేయాలిమాట వెన్నెల్లో జాబిలి అవ్వాలిజాజిపూల పరిమళంలా మనసును చుట్టేయాలిమాట […]

మకరందం Read More »

మహారాజు

మహారాజు – ఓ మంచి తాగుబోతు. ఈ నెల కౌముది పత్రికలో ప్రచురితం అయిన నా బహుమతి కథ. సంపాదకులకు కృతఙ్ఞతలు. మహారాజు కథని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలపండి. “రేయ్ ..రవనా ..లెగరా..బారెడు పొద్దెకుండాది, రేతిరి తాగింది ఇంకా దిగినట్టులేదు ఈడీకి” అనుకుంటా రవణడిని కుదిపాడు రిక్షాసుధాకర్. మొండి గోడ కింద పగటికి రాత్రికి తేడా తెలియని సుప్తావస్థలో పడుకున్న జీవిలాగా పక్కకి పొర్లాడు రవణడు కళ్ళు మూసుకొనే.“తూ..ఎదవ నాయాలా..! నిన్ను నమ్ముకోని బంగారంటి

మహారాజు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 42 – ప్యూన్ లేడు కనుక నీళ్ళు లేవు

“ప్యూన్ లేడు కనుక నీళ్ళు లేవు”. ఈనాటి విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి. డాక్టర్ బి.అర్. అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. జై భీమ్ “నేలతో నీడ అన్నది నను తాకరాదని – పగటితో రేయి అన్నది నను తాకరాదని”. ఇక్కడ కవి చమత్కారం ఎలా ఉన్నా ఎన్నో శతాబ్దాలుగా, ఎన్నో తరాలుగా అంటరానితనమనే ఒక అమానవీయ వైఖరి మనిషిని మనిషి తాకకుండా కట్టడి చేస్తోంది.

విమల సాహితి ఎడిటోరియల్ 42 – ప్యూన్ లేడు కనుక నీళ్ళు లేవు Read More »

దిశ మార్చుకో

మహిళా ఉద్యమ కరదీపిక ” మానవి” ద్వైమాసపత్రిక మార్చి -ఏప్రిల్ 2024 సంచికలో నా కథ “దిశ మార్చుకో” ప్రచురితం అయింది. సంపాదకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. “దిశ మార్చుకో” కథని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి నన్ను నేను తిట్టుకోవడం అప్పటికి వందోసారి. అమ్మ తోడుగా వస్తాను అంటే ” ఎందుకమ్మా… ఇంటర్వ్యూ ఎంతసేపు చేస్తారని, లంచ్ లోపలే అయిపోతుంది నేను వచ్చేస్తాలే… నువ్వు విశ్రాంతి తీసుకో అనడం నాది బుద్ది తక్కువ అయింది. నాలుగు

దిశ మార్చుకో Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 41 – షడ్రుచుల ఈద్ ముబారక్

“షడ్రుచుల ఈద్ ముబారక్” ఈ వారం విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి వసంతం – శరత్తు – హేమంతం, ఈ ఆమనీ బ్రతుకులో ఈ మూడే ఋతువులు. ప్రకృతిలో ఉన్నవి ఆరు ఋతువులు అయినా మనిషి జీవితంలో ఈ మూడే ఋతువులు ఉండాలి అని కవి ఎంత చమత్కారంగా అన్నాడో. ఎండలు మండే గ్రీష్మం, చిరుజల్లులను తుఫానులుగా కూడా మార్చేసే వర్ష ఋతువు, ఆకులు రాల్చే

విమల సాహితి ఎడిటోరియల్ 41 – షడ్రుచుల ఈద్ ముబారక్ Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 40 – పసుపు ముద్ద – గాజులు

ఈ వారం విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం “పసుపు ముద్ద – గాజులు”, చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి “హు..! శత్రువులను చూసి సమరానికి కాలు దువ్వకుండా పిరికి పందలా వెన్ను చూపి వస్తివా..అదిగో అక్కడ మంచం చాటున పసుపు ముద్ద, గాజులు పెట్టాను. పోయి పసుపు పూసుకుని, గాజులు వేసుకో పో” యుద్దానికి భయపడి లేదా యుద్ధంలో ఓడిపోయి తిరిగి వచ్చిన రాజులను చూసి ఓ వీర మాత, ఓ

విమల సాహితి ఎడిటోరియల్ 40 – పసుపు ముద్ద – గాజులు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 39 – సంతోషమా..! ఏది నీ చిరునామా..?

సంతోషమా..! ఏది నీ చిరునామా? ఈ నెల 20న World Happiness Day సందర్భంగా ఈ వారం ‘విమల సాహితీ పత్రిక ‘ లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి ఏడాదికి 365 రోజులు. ప్రతి రోజు ఓ ప్రత్యేక దినమే. మదర్స్ డే, ఫాథర్స్ డే, ప్రేమికుల దినోత్సవం, సైనిక దినోత్సవం. ఏడాది పొడవునా ప్రత్యేక దినాలే. నవమాసాలు మోసి, ప్రసవ వేదన అనుభవించి, జన్మనిచ్చిన అమ్మ త్యాగానికి, ప్రేమకు

విమల సాహితి ఎడిటోరియల్ 39 – సంతోషమా..! ఏది నీ చిరునామా..? Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 38 – స్వేచ్ఛ – ట్రోలింగ్ – కిల్లింగ్

స్వేచ్ఛ -ట్రోలింగ్-కిల్లింగ్. ఈ నాటి విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి సర్వ సత్తాక సామ్యవాద లౌకిక రాజ్యం మనది. రాజ్యంగంలో కూడా వ్యక్తి స్వేచ్ఛ గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. అఖండ భారతదేశంలో వ్యక్తులు లింగ బేధం లేకుండా తమకు నచ్చిన మతాన్ని ఎటువంటి నిర్బంధం లేకుండా అనుసరించవచ్చు. తమకు నచ్చిన నాయకులను ఎలక్షన్ ద్వారా ఎన్నుకోవచ్చు. ఇంకా మనకి ఎన్నోరకాల స్వేచ్ఛలు చట్టపరంగా ఉన్నాయి.

విమల సాహితి ఎడిటోరియల్ 38 – స్వేచ్ఛ – ట్రోలింగ్ – కిల్లింగ్ Read More »

పాసింగ్ ఫేజ్

కూలీ పనులు చేసుకునే శ్రామిక తల్లి అయినా, మధ్య తరగతి ఇల్లాలు అయినా కళారంగంలోని నటి అయినా అందరూ మహిళలే. ప్రతి జీవితంలోనూ సంతోషాలతో పాటు వేదనల ఎడారులు, అగాధాలు ఉంటాయి. ప్రజాశక్తి ఆదివారం అనుబంధం లో వచ్చిన “పాసింగ్ ఫెజ్” లో ఓ మహిళ తన జీవన సమస్యను ఎలా అధిగమించింది అనేది కథలో చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి 🌹🌹 “జీవితం చక్ర భ్రమణం, అది తిరుగుతూ తిరుగుతూ మొదలుపెట్టిన చోటుకే వస్తుంది ” అని

పాసింగ్ ఫేజ్ Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 37 – దేవతలు – దెయ్యాలు

మిత్రులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఆదివారం కన్నా రెండు రోజుల ముందే విమల సాహితీ వారపత్రిక మీ ముందుకు వచ్చేసింది. మహిళా దినోత్సవం రోజున అందరికి అందించే అపురూపమైన కానుక ఇది. ప్రతి మగవాడి జీవితంలోను మహిళలు అనేక రూపాల్లో ఉంటారు. అందుకే ఇది అందరి పత్రిక. ప్రతి ఒక్కరు దాచుకుని చదువుకోవాల్సిన సంచిక ఇది. అద్భుతమైన ముఖ చిత్రంతో వెలువడిన ఈ పత్రికలోని విశేషాలు: 1. మహిళలు అయితే దేవతలు కావాలి,లేదంటే దెయ్యాలు కావాలి.

విమల సాహితి ఎడిటోరియల్ 37 – దేవతలు – దెయ్యాలు Read More »