ధీమా

ప్రేమికుల దినోత్సవం రోజున ఈ వారం సృజన క్రాంతి పత్రికలో నా కవిత “ధీమా”. మిత్రులందరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు 🌹🌹❤️❤️

అతను పిజ్జా డెలివరీ బాయ్

నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్

అలసటతో ఇంటికొచ్చిన నాకు

వంటింట్లో అడుగుపెడితే నీరసం

అతను గుర్తుకు వస్తాడు ఆ క్షణం

క్షణాల్లో ప్రత్యక్షం అవుతాడు పిజ్జాతో

వెళుతూ వెళుతూ కాసిన్ని నవ్వులను

పిజ్జా తో పాటు డెలివరీ చేసిపోతాడు

నవ్వులన్నీ ఏరి మూటగట్టుకున్న నాకు

నా వలపు పిలుపు ఎక్కడుందో తెలిసింది

ఇప్పుడతనికి పిజ్జా ఆర్డర్ చేయడం లేదు నేను

నేనింటికొచ్చే సరికే టేబుల్ మీద తిండి

పెదవుల్లో నవ్వులు సిద్ధంగా ఉంచుతాడు

అంతరాలు అహాలు లేవు మాకు

ఉండేది ఒకరంటే ఒకరికి నమ్మకం

కడదాకా కలిసుంటామనే ధీమా

ఎన్నటికీ కరిగిపోని వలపు

మాది ప్రేమ”కులం”

మేము ప్రేమి “కులం”

రోహిణి వంజారి

14-2-2024