ఉషోదయం

“ఉషోదయాన తుషార బిందువులు
నింగి నుంచి జారి పచ్చని ఆకులపై వాలి
చల్లని కబుర్లు చెబుతున్నాయి..
ఎర్రగులాబీలు రాత్రి కురిసిన మంచులో
తడిసి మత్తులో సోలిపోతున్నాయి..
అందరి మత్తు వదిలించేందుకు
నేనొచ్చేస్తున్నానంటున్నాడు బాలభానుడు
తూర్పు పక్క అరుణ వర్ణాన్ని పులిమేస్తూ..
ద్వేషాలు రోషాలు వివక్షలు మానేసి
ప్రేమని పెంచుకోండి అంటూ ఈ ప్రకృతి
ఉదయరాగాలు ఆలపిస్తోంది ఆర్తిగా..


రోహిణి వంజారి
25-1-2023