మానవ హక్కులు

కులమత బేధాలను పెంచి పోషించి
విద్వేషాలను రగిల్చేదొకరు..
స్వార్థానికి విచ్చలవిడిగా వాడుతూ
ప్రకృతిని వికృతం చేసేది ఇంకొకరు..
శవాలకు కూడా కులం కుళ్ళు
అంటగట్టి చావును కూడా పండగ
చేసుకునే సైకోలు ఎందరెందరో..
ప్రతి స్త్రీ అంగాంగాన్ని కామపు కళ్ళతో
నిత్యం అత్యాచారం చేసే మృగపశువులు
ఇంకా ఎందరెందరెందరో..
హక్కుల కోసం పోరాడే ముందు
బాధ్యతలను ఒక్కసారి గుర్తుకు చేసుకుంటే
ఎంత పాతాళంలో ఉందో నీ వ్యక్తిత్వం
నీకు నీవుగా ప్రశ్నించుకో..
సమాధానం తెలిసిన రోజు నీవు
మనిషిగామారినట్లే కదా..
అప్పుడు నీ హక్కుల కోసమే కాదు
విశ్వమానవ సౌభ్రాతృత్వం కోసం
నువ్వు పోరాడతావు మనసున్న మనిషిగా


వంజారి రోహిణి
10-12-2021.