నేను టమేటా నండి
రామ ములక్కాడ అని కూడా నన్ననేవాళ్ళండి మీ పెద్దోళ్ళు
నేనేప్పుడూ రంగులు మార్చనండీ
ఏ కాలంలో అయినా ఎర్రగాగుండ్రంగానే ఉంటానండీ
కూరగాయలన్నింటిలోకి నేనేఅందంగా ఉంటానని
మీరందరూనన్నంటుంటే మురిసిపోతానండీ
పేద ధనిక కులం మతంతేడాలు నాకు తెల్వదండీ
అందరి కడుపులు నింపడమేనా అభిమతమండీ
నాటు టమేటాగా ఉన్న నన్నుహైబ్రీడ్
టమేటాగా మార్చింది మరి మీరేనండీ
కరువో,వరదో వస్తే తప్ప ప్రతిఏటా ఒకేలా కాపుకొస్తానండీ
మీ వంటింటి రుచుల్లో చట్నీ నోగ్రేవీనో, కర్రినో అవుతానండీ
ఈ డిమాండ్, సప్లైల మాయాజూదమేంటో నాకు తెల్వదండీ
ఆర్థిక సూత్రాలు అంటే కూడా నాకుఅసలికే తెలియదండీ
ఇప్పుడు నన్ను కిలో ఎనభై అంటారండీ
రేపు, మాపు కిలో ఎనిమిది రూపాయలకకూడా అమ్ముడు పోక
గిట్టుబాటు ధర లేదని నన్ను మట్టి పాలు చేసేది మీరేనండీ
నా మీద ఎన్ని జోకులేసినానా కోసం అసెంబ్లీలో చొక్కాలుచించుకున్నా
చివరాఖరికినష్ట పోయేది మాత్రం ఎవరనుకున్నారండీ
మీ ఆకలి తీర్చటం కోసం నన్ను సృష్టించిన
మీ అన్నదాతరైతేనండీ