నా కవితా ప్రస్థానం:
లోకం పోకడలు తెలిసి తెలియని వయస్సులో కాస్త మంచిర్యాంకు వచ్చి కూడా బి.ఎడ్ లో సీట్ పొందని నా అసమర్ధతను ఆవేదనఆవేశం కలగలిపి నా తొలి కవితగా విరచించిన వేళ…
—————————————————————————————————————————
చదవాలని వుంది నాకో కోర్సు
అందుకు చేశాను నేనో పెద్ద తపస్సు
నేను మహా మేధావిని కాదు
ఫస్ట్ ర్యాంకు కొట్టడానికి
రాజకీయ నాయకుడి బావమరిదినైనా
కాదు, రికమండేషన్ ఉత్తరం పెట్టడానికి!
హరిజనుడినైనా కాలేదు
రిజర్వేషన్ తో సీటు పొందడానికి
ఆఖరికి
అవిటివాడినైనా ఫిసికల్ హ్యాండీక్యాప్డ్
కింద సీట్ తెచ్చుకుని ఉండేవాడిని
నేనెవరంటే…
ఆర్ధికంగా చితికిపోయి అగ్రకులం
లిస్టు లో ముందుండి
దారిద్యపు ముళ్ళ కిరీటాన్ని తలపై
పెట్టుకుని నిరుద్యోగపు శిలువను
మోస్తూ భారంగా
బ్రతుకీడుస్తున్న అభాగ్యుడ్ని…