“నింగి వంగి నేలపైకి నీటిబొట్లతో
ప్రేమవంతెనేసింది
అణువణువు ప్రేమ చెమ్మతో
తడుపుకుంది
నేల ఒడిలో దాగున్న విత్తులు
వాననీటి ప్రేమ స్పర్శకి
గులామ్ అంటూ
విచ్చుకుని ఆకుపచ్చ తలలెత్తాయి
హరితంకిరణం సంగమించాయి
ప్రకృతి రంగులమయమైంది
జగతి ఆకలి తీర్చే
అక్షయపాత్ర కావటానికి
హరితకిరణాలు ప్రేమగా
సమాయత్తమవుతున్నాయి
జయహో హరితం
జయహో కిరణం”
రోహిణి వంజారి
31-07-2024