భరత ఖండం – ప్రేత ఖండం

మణిపూర్ ఘటన గురించి “భరత ఖండం – ప్రేత ఖండం” అని నేను రాసిన నిరసన కవిత “దిక్కారం” కవిత్వ సంకలనం లో ప్రచురితం అయింది. కపిల రామ్ కుమార్ గారికి ధన్యవాదాలతో..

కులాల -మతాలు

జాతులు -తెగలు

కక్షలు.. విద్వేషాలు

రోషాలు..నయ వంచనలు

అధికారం -ఆదిపత్యం

మీ సర్వ దరిద్రాలకి

బలయ్యేది మాత్రం అబలలా..?

యావత్ భారతం సిగ్గుతో

చితికిపోవాల్సిన తరుణం

ఈరోజు నిస్సహాయ వేదనతో

ఆ నగ్నంగా నడిచే

ఆ అబలల స్ధానంలో రేపు

మీ తల్లో చెల్లో ఆలో కూడా ఉండవచ్చు

నడిచే ఆ రెండు కాళ్ళ మధ్యలోనే

నీ జన్మ స్థానం ఉందని మరచితిరా

మనిషన్న వాడు కుళ్ళి కుళ్ళి ఏడవాలి ఇప్పుడు

మీరు మగవారైతే మీ తలలను

మీ మొలల్లో కి వంచుకోండి సిగ్గుతో

లేదంటే మతాలు జాతులు అంటూ

కొట్టుకుని సమస్త మానవులు చచ్చిపోండి

మీ సమస్త ఆవకరాలను అవనతం చేసుకోండి

మహిళల మాన ప్రాణాలు పణంగా పెట్టుకుని

మీరు ఆడే వికృత ఆటలకు ప్రకృతే

ఏదో ఒకనాడు మిమ్మల్ని సర్వనాశనం చేసేస్తుంది

భరతఖండం కర్మభూమి

ధర్మభూమి కాదిప్పుడు

మానవత్వాన్ని మంటకలిపే

పైశాచిక మృగాలు

కామ పిశాచాలు

కీచక, దానవ, రాక్షస గణాలు

తిరుగాడే ప్రేత ఖండం

రోహిణి వంజారి

9000594630

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *