నిస్సహాయ పక్కటెముక

అమ్మలారా..అక్కలారా..
సృష్టిని ఆపేద్దాం
వలువలు..విలువలతో నాకేం పని
ఏవరేమైతే నాకేం అంతా నా ఇష్టం
అంటారు ఒకరు..
డబ్బే నా పాలిటి బ్రహ్మ పదార్ధం
దాని కోసం ఏమైనా చూపిస్తాను
అంటోంది ఓ నటశిరోమణి..
మీ మత్తే మా ఆదాయం
అంటారు పాలకులు ..
చాటింగ్,మీటింగ్,డేటింగ్
స్వేచ్చా విహారమే నేటి నయా ట్రెండ్
అంటోంది నేటి నాగరిక యువత
ఏది తినవద్దు, ఏది తాగవద్దు
ఏది చేయవద్దు అంటే
అది చేయడమే మనిషి నైజం
అక్కడ తాగి, తిని, చూస్తే
ఇక్కడ మానవ జాతికి ఆధారాన్నిచ్చే
ఓ నిస్సహాయ పక్కటెముక
కామపు అడకత్తెరలో
భళ్ళున విరిగి నుజ్జు నుజ్జు అవుతోంది..
చేసేవన్నీ చేసి నీతులు చెప్పడమే
పైసా ఖర్చు లేని పని [అవి ]నీతిమంతులకు
నేరం రాజుదొక్కడిదేనా..?
ఇంకా ఎంత మంది ముదనష్టపు రాజులను
భావి తరాలకు అందిద్దాం చెప్పండి
ఇంకా ఎన్ని పక్కటెముకలనని
విరిచేసుకుందాం చెప్పండి
అందుకే అమ్మలారా..అక్కలారా..
సృష్టిని ఆపేద్దాం రండి
పక్కటెముకలను కాపాడుకుందాం రండి