నేను వ్రాసిన క్రింది కవిత “తియ్యదనం” మాలిక అంతర్జాల పత్రికలో ప్రచురింపబడినది. చదివి మీ అభిప్రాయాలు తెలియజేయు ప్రార్ధన.
————————————————————————————————————————-
కెజియా వచ్చి ప్రార్థన చేసిన
కేకు తెచ్చి ఇచ్చింది…
రంజాన్ నాడు రజియా వచ్చి షీర్ కుర్మా
రుచి చూడమంది…
దసరా పండుగ నాడు
విజయ వచ్చి అమ్మ వారి
ప్రసాదం చక్కెర పొంగలి
తెచ్చి నోట్లో పెట్టింది…
అన్నింటిలోనూ ఒకటే
తియ్యదనం…
అదే మనందరినీ కలిపే
మానవత్వం…
అనురాగపు వెల్లువలో
అందరం తడిసి
మురిసే వేళ, మనకెందుకీ కులమతాల గోల…