సృజన క్రాంతి సంపాదకులు శ్రీ విల్సన్ రావు కొమ్మవరపు Wilson Rao Kommavarapu గారికి హృదయపూర్వక ధన్యవాదాలు
ఉయ్యాల తొట్టిలో పొత్తి గుడ్డ
గిరగిరా తిరిగే గిలక బొమ్మ..
చందమామలో కుందేలు..
జాతరలో దొరికే చెరుకు గడ
పండుగ రోజు పట్టు వస్త్రం..
కన్నీటిని తుడిచే కడకొంగు
తడబడే అడుగులకు ఊతం..
పడిపోతే లేవనెత్తే ఆసరా
జీవిత పుస్తకంలో
తొలిపాఠం నేర్పించే గురువు..
గెలుపు ఓటమి ఏది వరించిన
నన్ను నన్నుగా చేసే ఓరిమి..
లోకానికి నా ఉనికిని తెలిపిన
నా సృష్టికర్త..
బొడ్డు తాడు తెంపినా
పేగు బంధాన్ని ఎన్నడూ
తెంపుకొని ప్రాణంలో ప్రాణం..
దేహమంటే నాది కాదు
అది నాకు పెట్టిన జీవాభిక్ష..
నాకు దేహాన్ని మనస్సును
ఇచ్చిన ఆ దేవతా మూర్తి
నా మాతృమూర్తి..
దేహన్నిచ్చి
ప్రేమనిచ్చి
జీవితాన్నిచ్చి ..
తమకోసం ఏమి దాచుకోని
ఇలలోని దేవతలకు
హృదయాంకిత వందనాలు..
రోహిణి వంజారి
హైదరాబాద్