కవితలు

రా రా కృష్ణయ్యా

కృష్ణా…. మన్ను, వెన్నలు తిన్నది ఇక చాలయ్యా వన్నె,వలువలు దోచింది కూడా ఇక చాలు చాలయ్యా “దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై సంభవామి యుగే యుగే” అంటూ దుష్టులను శిక్షించడానికి శిష్టులను రక్షించడానికి వస్తానన్నావు కలియుగానికి మాత్రం రాకుండా శీతకన్నెసావు ఏమయ్యా… ఇపుడు కలియుగం అంటే కంసులు,పూతనలు, మారీచులు,శిశుపాలురూ వందలు,వేల సంఖ్యలో తిరుగాడుతున్న కలి కాలమిది… దొంగతనాలు,దోపిడులు, హత్యలు, అత్యాచారాలు, వివక్షలు,ఊచకోతలు హెచ్చుమీరిన దుష్టయుగం ఇది.. కాలుష్యాలు,కరోనాలు అంతుచిక్కని అంటురోగాలు ప్రభలిన రోగ లోకం ఇది.. మతి తప్పిన మానవజాతి […]

రా రా కృష్ణయ్యా Read More »

దిగులు వర్ణం

రంగులు చాల ఉన్నాయి ప్రకృతిలో. ఈ దిగులు వర్ణం ఏమంటుందో చూడండి. “బహుళ త్రైమాసిక పత్రిక” లో ప్రచురితం అయిన నా కవిత “దిగులు వర్ణం”. జ్వలిత మేడం గారికి ధన్యవాదాలతో.. ” దిగులు వర్ణం” చదివి మీ దానికి మీరు ఏం చెప్తారో అడుగుతోంది. ఆరంజ్ రంగంటే ప్రాణమప్పుడువెన్నులో వణుకిప్పుడు ప్రాణంతీస్తుందనికాషాయపు విద్వేషాన్ని పులిమేశారు దానికి గులాబీ పసుపు రంగుల్లో ఎంత అందముందనిచూడడానికే భయమిప్పుడుపార్టీల అడ్డు తెరని దించారు వాటిమీద ఎంత వింతైనవర్ణమని నలుపుదానికీ అంటగట్టారు

దిగులు వర్ణం Read More »

మమతల దారుల్లో

తెలుగు జ్యోతి పత్రిక ఏప్రిల్ నెలలో ఉగాది కవితల పోటీల్లో ఎన్నుకోబడిన నా కవిత “మమతల దారుల్లో”. తెలుగు జ్యోతి పత్రిక సంపాదకులకు ధన్యవాదాలతో🌹🙏 కోటి ఆశలతో మాఇంట్లో అడుగుపెట్టిన మా కూతురు లాంటి కోడలు ” సాయి సాహిత్య” కి ఈ కవిత అంకితం ప్రేమతో ❤️❤️మమతల దారుల్లో ప్రయాణం కొత్తమజిలీకిఇదివరకెన్నడూ చూడని దారిఆశలు దీర్ఘాలైభయాలు హ్రస్వాలైముందుకు సాగే పయనంఅలుపొచ్చి ఆగిపోతే సేదదీరడానికిఅమ్మ పాడిన జోలపాటనిగుండె ఊయల్లో దాచుకుని వెళుతున్నా..బాటలో పరాకుగా అనిపిస్తేఉల్లాసం పొందడానికిచెల్లి తమ్ముడుతో

మమతల దారుల్లో Read More »

వసంత యామిని

“నేటి నిజం” దిన పత్రికలో “వసంత యామిని కవిత”. బైస దేవదాస్ గారికి ధన్యవాదాలతో. వసంత యామిని ని చదివి మీ విలువైన అభిప్రాయాన్ని తెలపాలని కోరుకుంటూ “ఒకానొక సాయం సంధ్య వేళగమ్యం తెలియని తెరువరిలా అడుగులు వేస్తున్నాదేహం ముందుకు కదులుతోంది భారంగామనస్సుకి మాత్రం ఏదో తెలియని అలజడిజ్ఞానేంద్రియాల్లోకి చొచ్చుకు వెళుతున్న లోకపు వింతపోకడలుగుండెను మెలితిప్పుతున్న జ్ఞాన నరాలుఎల్లెడలా అసూయా ద్వేషం జంట కవుల్లా విజృంభిస్తున్నాయికామక్రోధాలు రాబందుల జతలా ఆడదేహాలను ఛిద్రం చేస్తున్నాయిదౌర్జన్యం రాక్షసనీడలా కమ్ముకుంటోందినిరాశ నివురుగప్పిన

వసంత యామిని Read More »

నిత్య ప్రేమికుడు

“వాడికి నా అందంతో పనిలేదుఆపాదమస్తకం గిలిగింతలు పెట్టేస్తాడువాడు నా రంగు తెలుపా నలుపా చూడడువాడి నఖక్షతాలు దంతక్షతాలు సరేసరివాడికి నా గెలుపోటములతో పనిలేదునా చేత్తో పెడితే కానీ ఒక్క ముద్దైనా తినడునేను బయటకెళితే చాలు వాడి కళ్ళల్లో గుబులువాకిట్లో తోరణాలకి వాడి చూపులను వేలాడదీస్తాడునేనేదో కానుకలు తెస్తానని ఆశపడడునేను తిరిగొచ్చే దాక గుమ్మం దగ్గరే వాడి మకాంరోజూ I LOVE YOU చెప్పలేదని అలగడునా ఒడిలోచేరి ప్రేమగీతాన్ని మౌనంగా ఆలపిస్తాడుకాసింత పరాగ్గా ఉన్నా చాలుకళ్ళల్లోకి చూస్తూ చూస్తూ

నిత్య ప్రేమికుడు Read More »

ఉనికి

తెలుగు సొగసు ఆన్లైన్ పత్రిక “ప్రేమికుల దినోత్సవం” ప్రత్యేక సంచిక లో ప్రచురితమైన నా కవిత “ఉనికి” ❤❤ ఆమెకెపుడు నేను గుడ్ మార్నింగ్ చెప్పలేదుతన అడుగుల సవ్వడే నాకు హిందోళరాగంతననెప్పుడూ ఖరీదైన హోటల్కి తీసుకెళ్లలేదుతనువండిన వంటలో ఏడో రుచినేదో కలిపేదిఆ మధురమైన రుచి నాకు ఇంకెక్కడా దొరకలేదుబహుశా ఆ రుచి పేరు అనురాగమేమోతనకెప్పుడు నేను గులాబీలు ఇవ్వలేదుతన నవ్వులతోనే ఇల్లంతా రంగులద్దుకునేవిసాయంకాలమైతే చాలు తనచూపుల్నిగుమ్మంలోనే వేలాడదీసేదినన్ను చూడగానే తన కళ్లల్లో మెరుపులువాటితోనే రాత్రంతా వెలుగులు నింపేదితనెప్పుడు

ఉనికి Read More »

పాలకోవా బిళ్ళ

పాలకోవా బిళ్ళ మీకు ఇష్టమేనా..? చిన్నప్పుడు నాకు చాలా ఇష్టం. మరి నాకు ఇష్టమైన పాలకోవాని నేను తిన్నానా లేదా.. ఈ నెల [మార్చి ] సాహితీ ప్రస్థానం లో ప్రచురితం అయిన “పాలకోవా బిళ్ళ” కవిత చదివితే తెలుస్తుంది. సత్యాజీ గారికి ధన్యవాదాలతో..“పాలకోవా బిళ్ళ” చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపగోరుతూ.. మా ఇంటి మొండి ప్రహరీ గోడ కిందకరీం తాత చిల్లర బంకునా బాల్యపు తీపి రెస్టారెంట్..సీసాలో తెల్లగా గుండ్రంగా పాలకోవా బిళ్ళలువెండి చందమామల్లా

పాలకోవా బిళ్ళ Read More »

అతడే

నా బుంగరెట్టల గౌను సాక్షి గా జ్ఞాపకాల పొరల్లోని టైలర్ రంగయ్య స్మృతిలో.. మనం అందంగా కనపడాలని, మన ఆత్మ గౌరవాన్ని నిలపాలని అహర్నిశలు శ్రమించే దర్జీలందరికీ “ట్రైలర్స్ డే”, శుభాకాంక్షలతో❤️❤️🙏🙏 “వీధి చివర బంకులో అతడుదీక్షగా పనిచేసుకుపోతున్నాడుఅతని చూపులు నిశితంగామమతల దారాల వెంట పరుగు తీస్తున్నాయిఅతని చేతివేళ్ళు అభిమానపు వంతెనలనునిర్మిస్తున్నాయి..అతని కాళ్ళు కదిలినప్పుడల్లాటక టకమని వొచ్చే శబ్దంశ్రమజీవన రాగాన్ని వినిపిస్తోంది..బుంగ రెట్టల గౌను కుట్టేశావా..?ఆశగా అడుగుతుంది ఓ చిన్నారి పాపలాగుచొక్కా కొత్త ఫ్యాషన్తో కుట్టమంటాడు మునీర్

అతడే Read More »

కడలి – అల

నమస్తే. ఈనాటి “నవతెలంగాణ సోపతి” లో నా కవిత “కడలి – అల”. సంపాదకులు శ్రీ కే. ఆనందాచారి గారికి ధన్యవాదాలతో.. కవితను చదివి మీ విలువైన అభిప్రాయాన్ని తెలుపగోరుతూ.. తను నీలాకాశం అయితేనేను మెరిసే తారకనవుతాతను కదిలే మేఘం అయితేనేను పురివిప్పే మయూరమవుతాతను కురిసే వర్షపు చినుకైతేనేను మొలకెత్తే చిగురునవుతాతను పోటెత్తే కడలి అయితేనేను ఊరకలేసే అలనవుతాతను పొదరిల్లు అయితేనేను ఇంటిదీపాన్నవుతాతను నా జీవితనౌక అయితేనేను తనని నడిపే తెరచాపనవుతామేము ప్రతిరోజూ ఐ లవ్ యు

కడలి – అల Read More »

ఉషోదయం

“ఉషోదయాన తుషార బిందువులునింగి నుంచి జారి పచ్చని ఆకులపై వాలిచల్లని కబుర్లు చెబుతున్నాయి..ఎర్రగులాబీలు రాత్రి కురిసిన మంచులోతడిసి మత్తులో సోలిపోతున్నాయి..అందరి మత్తు వదిలించేందుకునేనొచ్చేస్తున్నానంటున్నాడు బాలభానుడుతూర్పు పక్క అరుణ వర్ణాన్ని పులిమేస్తూ..ద్వేషాలు రోషాలు వివక్షలు మానేసిప్రేమని పెంచుకోండి అంటూ ఈ ప్రకృతిఉదయరాగాలు ఆలపిస్తోంది ఆర్తిగా.. రోహిణి వంజారి25-1-2023

ఉషోదయం Read More »