కధలు

86. బ్రహ్మమెుక్కటేనా..?

పైనేని మునెమ్మ స్మారక కథల పోటీ లో ప్రథమ బహుమతి పొందిన కథ “బ్రహ్మమెుక్కటేనా..?” కథ”అమ్మ కోసం.. కొన్ని మంచి కథలు” సంకలనంలో ప్రచురితమైంది. కథని చదివి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. పైనేని తులసినాథం నాయుడు గారికి ధన్యవాదాలతో తాను కొనుక్కున్న చొక్కా కాదిది.. ఈ చొక్కానే తనను కొనుక్కుంది..! నవ్వొచ్చింది, చేతకానితనాన్ని కప్పెట్టేస్తున్నట్టు. ఎంతకి అమ్ముడుపోయాడు తను? దేనికి? ఋణం ఎంత సేపో, అంతసేపు తాను దానిని తొడుక్కుంటాడు. అది తనతో ఆడుకుంటుంది. తనను […]

86. బ్రహ్మమెుక్కటేనా..? Read More »

85. గిఫ్ట్

RAM…. Online Magazine లో ప్రచురితమైన కథ “గిఫ్ట్” తప్పకుండా చదవండి. మీ అనుభవాలు ఇక్కడ కామెంట్స్ లో తెలుపండి. మహిళా దినోత్సవ శభాకాంక్షలు. Sudhama Avr సర్ కి కృతజ్ఞతలు మార్చి నెల. సాయంత్రం నాలుగయింది. పొద్దునంతా కాచిన ఎండ అలిసిపోయి, మెత్తబడి కాస్త తెరిపి ఇచ్చింది. ఇంటికి అర్ధకిలోమీటర్ దూరంలో ఉన్న వాకర్స్ పార్కు కి బయలుదేరాడు జగదీష్. అతను వెళ్ళేసరికే బెంచి మీద కూర్చుని ఎదురుచూస్తూ ఉన్నాడు మహేశ్వర్. బ్యాంకు లో పని

85. గిఫ్ట్ Read More »

బంగారు బొమ్మ రావేమే..!

#story వివాహం ఎంతో ఘనమైనది అని అన్నీ మత గ్రంథాలు చెబుతున్నాయి. అటువంటి వివాహం ద్వారా వదువరులు ఒకటయ్యే శుభ సందర్బంగా రిటర్న్ గిఫ్ట్ గా అతిథులకు ఏవేవో ఉపయోగం లేని గిఫ్ట్స్ కన్నా, మంచి పుస్తకాన్ని ముద్రించి అతిథులకు ఇవ్వడం అనేది మంచి ఆలోచన. కొత్త ఒరవడి. కవులు సాగర్ల సత్తయ్య గారు “వివాహ సందర్భంగా ఒక మంచి కథ రాసి పంపండి మేడమ్. సంకలనం వేస్తున్నాం. కథని రెండు రోజుల్లో రాసి పంపండి” అని

బంగారు బొమ్మ రావేమే..! Read More »

దయామయులు

‘ ఇంకాసేపట్లో ఈ ముసలాడిని చంపేస్తాను‘ అనుకోగానే అతని మనసు శాంతించింది. ఎవరతను? ఎందుకు ముసలివాడు అనే జాలి లేకుండా చంపాలి అనుకున్నాడు? “మల్లె తీగ ” మాస పత్రిక కథల పోటీ లో ఎంపిక అయిన నా కథ @దయామయులు చదవండి. ఇంకో విశేషమేమిటంటే ఈ కథ నెల్లూరులోని ఒక ప్రముఖ హాస్పిటల్లో జరిగిన యధార్థ గాధ కి అక్షర రూపం . మీ మిత్రులకు షేర్ చేస్తే కథ ఎక్కువ మంది కి చేరుతుంది.

దయామయులు Read More »

81. మనసు వెళ్ళని చోటు

మనసు ఎందుకు, ఎక్కడికి వెళ్ళకూడదు? ఈనాటి ప్రజాశక్తి దినపత్రిక ఆదివారం అనుబంధం స్నేహ బుక్ లో నా కథ “మనసు వెళ్ళని చోటు” చదవండి. స్నేహ సంపాదక బృందానికి, Santhi Sri Madam కు ధన్యవాదాలతో.. ‘ఇప్పుడిక అంతా అయిపోయింది. వాడు నా దగ్గరకు రావాలని ప్రయత్నిస్తున్నాడు. వద్దు వద్దు.. ఎట్టి పరిస్థితిలోను వాడిప్పుడు నా దగ్గరకు రావడానికి వీల్లేదు. వాడ్ని నా దగ్గరకు రాకుండా ఎలా ఆపాలి? ఇప్పుడు నేనేం చేయగలనని..?’ ఆ రోజు నాయినమ్మ

81. మనసు వెళ్ళని చోటు Read More »

గజ్జల గుఱ్ఱం

అన్యోన్యంగా సాగుతున్న కాపురంలో అనుకోని విపత్తు జరిగితే ఆ సంసారం ఏమైంది? ఈ త్రైమాసిక పత్రిక “బహుళ” లో “గజ్జల గుఱ్ఱం” కథ చదవండి. Jwalitha Denchanala మేడమ్ కి ధన్యవాదాలతో.. ‘ఘల్లు..ఘల్లు..ఘల్లు…’ ఆ శబ్దానికి చిరు మందహాసం మురళి పెదాల మీద తొణికిసలాడింది. పదేళ్ల నుంచి ఇంట్లోనే కాదు, తన గుండెల్లో కూడా నర్తించే మువ్వల రవళి అది. సన్నగా నవ్వుకుంటూ దుప్పటి మరింత మీదకు లాక్కున్నాడు. పెళ్లి చూపుల్లో అతను మొదట చూసింది మోహన

గజ్జల గుఱ్ఱం Read More »

అమ్మోరి భ్రమరాంబ

ప్రతిష్టాత్మకమైన “ఖమ్మం ఈస్తటిక్స్ 2024” కథల సంకలనం లో ప్రచురితమైన నా కథ “అమ్మోరి భ్రమరాంబ” చదవండి. ఈ కథకి ముగింపు లేదు. మీరైతే ఎలాంటి ముగింపు ఇస్తారు తెలుపండి. “ఒరే..అబ్బయ్యా..కేశవా..హైద్రాబాద్లో యుగంధరన్న ఉండాడనే ధైర్యంతోనే నిన్ను పంపిస్తా ఉండాను. అన్నచెప్పినట్లిని బాగా చదువుకోరా. ఈడ మాదిరిగా ఆడ సావాసగాళ్ళతో జేరి ఏడికిబడితే ఆడికి తిరగబాక”.“సరేలే మా. ఎన్ని తూర్లు చెప్పినమాటే చెప్తావు. ఇకన రైలు కదలతాది. ఇంటికాడ నాయిన, నాయనమ్మ ఎదురుజూస్తా ఉంటారు. నువ్వింటికి పో,

అమ్మోరి భ్రమరాంబ Read More »

భరత ఖండం – ప్రేత ఖండం

మణిపూర్ ఘటన గురించి “భరత ఖండం – ప్రేత ఖండం” అని నేను రాసిన నిరసన కవిత “దిక్కారం” కవిత్వ సంకలనం లో ప్రచురితం అయింది. కపిల రామ్ కుమార్ గారికి ధన్యవాదాలతో.. కులాల -మతాలు జాతులు -తెగలు కక్షలు.. విద్వేషాలు రోషాలు..నయ వంచనలు అధికారం -ఆదిపత్యం మీ సర్వ దరిద్రాలకి బలయ్యేది మాత్రం అబలలా..? యావత్ భారతం సిగ్గుతో చితికిపోవాల్సిన తరుణం ఈరోజు నిస్సహాయ వేదనతో ఆ నగ్నంగా నడిచే ఆ అబలల స్ధానంలో రేపు

భరత ఖండం – ప్రేత ఖండం Read More »

చిట్టి చామంతి

ఈ వారం నవతెలంగాణ ” సోపతి” magzaine లో నా కథ “ చిట్టి చామంతి” ప్రచురణ అయింది. కథ ను చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి.. టైం తొమ్మిదిన్నర అయుండె. ఇంకో అర్ధ గంటలో ఆన్లైన్ క్లాసుల కూర్చోవాల. పొద్దున పని అయింది. టవల్ తీసుకుని స్నానానికి వెళుతుండగా కాలింగ్ బెల్ మ్రోగింది. ఈ టైం ల ఎవరై ఉంటరు! తలుపు తీసి తీయక ముందే “అక్కా.. మీ ఇండ్లల్ల ఏమైన పని ఉంటే

చిట్టి చామంతి Read More »

ఆ నలుగురు

విశాఖ సంస్కృతి పత్రిక కథల పోటీ లో గెలుపొందిన కథ వెనుక కథ “ఆ నలుగురు”. ఆ నలుగురు..అలా కలిశారు.. ఎవరా నలుగురు? ఎక్కడ కలిశారు?రోహిత్ విసురుగా నెట్టేశాడు వేంకటేశుని. నేల మీద ధభీమని పడిపోయాడు వేంకటేశు. వాడి ఊత కర్రలు కాస్త దూరంగా పడ్డాయి.“పోరా కుంటోడా..నీకు మాతో ఆటలు కావాల్సివచ్చిందా రా” కాలరెగరేసి విలాసంగా నవ్వుతూ అన్నాడు రోహిత్. వాడి మిత్ర బృందం నవ్వులు కూడా శృతి కలిసాయి.రోహిత్ తోసిన తోపుకు కింద పడ్డ వెంకటేశు

ఆ నలుగురు Read More »