స్పర్శ

నేను వ్రాసిన క్రింది కవిత “స్పర్శమాలిక అంతర్జాల పత్రికలో ప్రచురింపబడినది. చదివి మీ అభిప్రాయాలు తెలియజేయు ప్రార్ధన.


చంటి బిడ్డకే తెలుసు
అమ్మపొత్తిళ్ళలోని వెచ్చదనపు స్పర్శ…
ఎడారిలో ఎండమావికే తెలుసు
ఎప్పుడో ఏనాటికో
నింగి నుండి జారి పడే
వాననీటి స్పర్శ…
యుద్ధవీరునికే తెలుసు
విజయం వరించినపుడు
భుజం తట్టి అభినందించే
అనుంగుల చేతి స్పర్శ…
నిరాశ నిండిన మనసుకే తెలుసు,
జీవితంలో ఏది
సాధించలేని ఓటమి స్పర్శ…
ఓటమికే తెలుసు, ఓడిపోయినా వీడిపోక
వెన్నుతట్టి ధైర్యం చెప్పే
మిత్రుని ప్రోత్సాహపు స్పర్శ…
రాఖీ కట్టే సోదరికే తెలుసు
సోదరుని కరచాలనపు
ఆత్మీయ స్పర్శ…
కానీ
ప్రతి అతివకూ తెలుసు
బాహ్య,అంతర్గతాన
కామాన్ని నింపుకుని
దుర్మార్గపు దాడికి పాల్పడాలనుకునే
మదపిశాచుల నిక్రృష్టపు
కరస్పర్శ…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *