సూసైడ్ నోట్

శుభోదయం. ఈ రోజు నవతెలంగాణ దినపత్రిక దర్వాజా పేజీ లో నా కవిత “సూసైడ్ నోట్”

మెల్లగా పాకుతోందది
దాని స్పర్శ ఒంటికి తగిలినప్పుడల్లా
జుగుప్సాకర జలదరింపు
ఎదిగీ ఎదగని నా ఎదను
దాని ఇనుప చేతులు నొక్కినప్పుడల్లా
చురకత్తితో నా గుండెను చీల్చుతున్నంత బాధ
దాని మదపు వేళ్ళు
నా తొడమీద పాకుతుంటే
వారించలేని నా నిస్సహాయతని
చంపేయాలన్నంత కసి నాలో
తరతరాలుగా మా ఒంటిమీద దాని మృగపు వేళ్ళు
పాకుతూనే ఉన్నాయి కామపు కుళ్ళుతో..
మదపురసి కారుతున్న దాని వికృతపు వేళ్ళను
నరికే శక్తి నా బాల్యానికి లేదు
ఆత్మాభిమానం, అధైర్యం
నా గొంతు నొక్కేశాయి మీకు చెప్పనీకుండా
అందుకే నన్ను నేను శిక్షించుకుంటున్న
ఉరి ఉయ్యాలలో శాశ్వతనిద్రలో
కమ్మని కలను కంటున్నా..
పాకుతున్న వేళ్ళను తునాతునకలుగా
నరుకుతూ మొదలంటా చీడపురుగును
అంతమొందిస్తూ, ఆనందిస్తూ..
మరో చిన్నారి సూసైడ్ నోట్
రాయకుండా చూసే బాధ్యత మాత్రం
మీకు అప్పగించి వెళుతున్నా..

1 thought on “సూసైడ్ నోట్”

  1. సూసైడ్ నోట్ కవిత చాలా చాలా బాగుంది మేడం గారు

    Reply

Leave a Comment