![](https://vanjarirohini.com/wp-content/uploads/2023/02/325405378_894132022038798_8643950450797536850_n-760x1024.jpg)
![](https://vanjarirohini.com/wp-content/uploads/2023/02/325739130_1340796349852786_1536976213768164014_n-462x1024.jpg)
![](https://vanjarirohini.com/wp-content/uploads/2023/02/325414664_3445726092331362_1252616259262267244_n.jpg)
![](https://vanjarirohini.com/wp-content/uploads/2023/02/325442329_1797641940600103_8649554999680282832_n-462x1024.jpg)
“పైపైకెగరాలని ఉంది గాలిపటంలా
నింగి అంచులు తాకాలనుంది స్వేచ్ఛగా
అడొచ్చే ఏ దుశ్చక్తినైనా తృణీకరిస్తూ
విజయతీరాలకు దూసుకు వెళ్ళాలనుంది
నిప్పులుచెరిగే అంతరీక్ష నౌకలా
ఎదురైయ్యే అవరోధాలను అధిగమిస్తూ
గెలుపు తలుపులు తెరవాలనుంది
ఉత్సాహానికి వారసురాలిగా
గాలివాటానికి సుడులు తిరుగుతూ
ధూళిలో కలిసే కాగితపు ముక్కలా కాక
దృఢమైన వ్యక్తిత్వపు అస్థిత్వంతో
కార్యాచరణకు పూనుకోవాలనుంది
లక్ష్యాన్ని చేధిస్తూ వెళ్ళే క్షిపణిలా
ఎంత ఎత్తు ఎదిగినా విజయపు శిఖరం చేరుకున్నా
నేలమీది పునాదులను మరువకుండా
కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉండాలనుంది
అలుపెరుగని తేనెటీగలా”
రోహిణి వంజారి
15-1-2023