Close Menu
    Facebook X (Twitter) Instagram
    రోహిణి వంజారి
    • కధలు
    • కవితలు
    • సమీక్షలు
    • విమల సాహితి ఎడిటోరియల్స్
    Facebook YouTube
    రోహిణి వంజారి
    Home»కవితలు»యుద్ధమే ముద్దు
    కవితలు

    యుద్ధమే ముద్దు

    వంజారి రోహిణిBy వంజారి రోహిణిOctober 29, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    గణేష్ దిన పత్రికలో ఈ రోజు[29-10-2023] నేను రాసిన కవిత “యుద్ధమే ముద్దు” ప్రచురితమైంది. మిత్రులు చదివి మీ స్పందనను తెలుపండి.

    యుద్ధం అనివార్యం
    పోరాటం జరగాల్సిందే
    శత్రువుని తుదముట్టించాల్సిందే
    బాంబర్ల మోతతో చెవులు తూట్లు పడుతున్నా
    యుద్ధ ట్యాంకుల శబ్దం గుండెల్లో వణుకుపుట్టిస్తున్నా
    యుద్ధమే ముద్దు మాకు అంటావా?
    తెగిన తలలనుంచి ఏరులై పారుతున్న నెత్తురు
    తల్లి శవం మీద పడి తల్లడిల్లుతున్న శిశువు
    కూలిపోయిన ఇళ్ళు పొగ చూరిన గోడలు
    శిధిలాల మధ్యనుంచి వినిపించే ఆర్తనాదం
    ఏవి కదిలించలేవు నిన్ను
    యుద్ధమే కావాలి నీకు
    యుద్ధ విజేతల సమాధులు చెప్పే కథలు విను
    ఎన్నిఉసురులు నువ్వు తీసినా
    ఎంత గొప్ప వీరుడివి అయినా
    నీకు మిగిలేది శూన్యమే బూడిదే
    అశోకుడు ఔరంగజేబుకే తప్పలేదు
    కాలగతిలో కలిసిపోవడం
    ఇక్కడ ఎవరు శాశ్వతం అనుకుంటున్నావు
    ఈ రోజు వాడు, రేపు వీడు, అటు తర్వాత నువ్వు
    ఏదో రోజు కాలం చేతిలో ఓడిపోకతప్పదు
    అందుకే యుద్ధం చేయి
    పోరాటం జరుపు
    శత్రువు వణికిపోయేలా తరిమికొట్టు
    కానీ ఆ శత్రువు ఎక్కడున్నాడో గుర్తించు
    నీలోకి నువ్వు వెళ్లు
    నిన్ను నీలోని మనిషిని చేరుకోవడానికి
    నీలోని మానవత్వాన్ని బతికించడానికి
    నీలోని శత్రువులను నువ్వు వెతికి పట్టుకో
    నీలో పగ, ద్వేషం రూపంలో నిన్ను
    నిలువరిస్తున్న శత్రువులను తుదముట్టించు
    ప్రేమ అనే ఆయుధానికి పదును పెట్టు
    నీలోని ప్రేమతో నీలోని ద్వేషాన్ని తునాతునకలు చెయి
    మానవత్వపు పల్లకి బోయివై ప్రేమను మోస్తూ
    కన్నీటితో పన్నీటితో గుండెగదులను నింపుకో
    మనిషి తనాన్ని ప్రేమగా హృదయానికి హత్తుకో

    రోహిణి వంజారి
    9000594630

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    వంజారి రోహిణి
    • Facebook

    నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో యాభై కథలదాకా ప్రచురితం అయినాయి. . నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను.

    Related Posts

    చంద్రకాంత చెలి

    November 26, 2023
    Read More

    ప్రొజెక్షన్

    September 9, 2023
    Read More

    అడగని వరం

    August 13, 2023
    Read More

    Leave A Reply Cancel Reply

    వెలువరించిన తొలి కథల సంపుటి “నల్ల సూరీడు”
    Categories
    • కధలు (68)
    • కవితలు (59)
    • విజయ మహల్ సెంటర్ కథలు (11)
    • విమల సాహితి ఎడిటోరియల్స్ (21)
    • సమీక్షలు (11)
    • సాహో అందమే ఆనందం (7)
    • సాహో ఆరోగ్యమే ఆనందం (5)
    • స్వగతం (1)
    Facebook YouTube
    © 2023 VanjariRohini.com

    Type above and press Enter to search. Press Esc to cancel.