మనిషి’లో’ చెత్త

క్రింది కవిత “మనిషి’లో’ చెత్తనవ్య వీక్లీ లో 29-8-2018 న ప్రచురింపబడింది. చదివి మీ అభిప్రాయాలు తెలియజేయండి.

—————————————————————————————————————————

మనిషి స్పర్శించడం మానేశాడు
కరచాలనాలు, ఆలింగనాలు, కంటి చూపులు
చిరునవ్వుల చిత్తరువులు.. ఊహ.. ఏమి లేవిప్పుడు
మనిషి స్పర్శేంద్రియాన్ని కోల్పోయాడు
మనిషి ఘ్రాణించడం మానేసాడు
మల్లెల మకరందాలు, మట్టి సువాసనలు
పచ్చటి పొలాల పైరగాలుల పరిమళాలు
ఆస్వాదన లేనే లేదిప్పుడు
మనిషి ఘ్రాణేంద్రియాన్ని కోల్పోయాడు
టీ.వీ. ముందో, ఐపాడ్, ఐఫోన్ లోని
టచ్ స్క్రీన్ ని ఓ చేత్తో జరుపుతూ మరో చేత్తో
తింటున్నది ఏం రుచో తెలీనంతగా
మనిషి జిహ్వేంద్రియాన్ని కోల్పోయాడిప్పుడు
నేత్ర ,చక్షువులు రెండే జ్ఞానేంద్రియాలు
ఉన్నాయిప్పుడు మనిషికి
అవి మాత్రం క్షణమాత్ర కాలమన్నా తీరికలేక
నిరంతరం పని చేస్తున్నాయి ఇప్పుడు
ముఖపుస్తకంలో, వాట్సాప్ లో , ట్విట్టర్లో
ఎక్కడో ఓ చోటనించి హడావిడిగా
లేనిపోని చెత్తనంతా బుర్రకెక్కించుకుంటూ
మరో బుర్రలోకి బదిలీ చేస్తూ, డంబర్ బిన్ కంటే
చెత్తగా మనిషి మెదడును చెరుపుతూ కక్షలు, ఆవేదనలు, ఆక్రందనలు, పగలతో
నిరంతరం మనిషిని కుళ్ళబొడుస్తూ…

1 thought on “మనిషి’లో’ చెత్త”

  1. Manishilo chetha aksharalaaa nijam appatlo tv Mari ippudu arachetilo charavani.kanti reppa veyadam ledu lokam teliyadam ledu….mandulu free,vidya freed anakundaaa net freeeee….chetha mayam.

    Reply

Leave a Comment