పెట్టెలో బొమ్మ

క్రింది కవిత “పెట్టెలో బొమ్మనవ్య వీక్లీ లో ప్రచురితమైంది. చదివి మీ అభిప్రాయాలు తెలియజేయు ప్రార్ధన.

————————————————————————————————————————-

అర్థరాత్రి ఏ జాములోనో
నిద్దర్లో ఏ దుస్వప్నాన్ని తిలకించాడో !
బిడ్డ ఉలిక్కిపడి తల్లిని హత్తుకుని
అమ్మా! నాన్నేప్పుడొస్తాడే! అడిగాడు
వస్తాడు నాన్న శూరుడై , ధీరుడై
ఉగ్రవాద ఉక్కు పాదాన్ని పాతాళానికి నెట్టివేసి,
విజయ కేతనాన్ని ఎగరేసి వీరుడై వస్తాడు!
మరి నాన్న వచ్చేటప్పుడు పెట్టి నిండా నాకు
బొమ్మలు తెస్తాడా?
తప్పకుండా అన్నదమ్మ.
పెట్టెలో బొమ్మలు తెస్తాడని చెప్పావుగా
మరి నాన్నే పెట్టెలో వచ్చాడేంటమ్మా?
ఇక్కడ మనందరం హాయిగా నిద్రపోవటానికి
అక్కడ నాన్న ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు.
సరిహద్దుల్లో ఉగ్రవాద రక్కసిని పెకిలిస్తూ
పెట్టెలో బొమ్మై తిరిగి వచ్చాడు!
వీరజవానుకు అశ్రుతర్పణాన్ని
నివేదించింది వీరపత్ని

2 thoughts on “పెట్టెలో బొమ్మ”

  1. గుండెల్ని పిండే కవిత.
    నిద్రలేని రాత్రులు గడిపి పెట్టెలో నిద్రపోతున్నాడు

    Reply

Leave a Comment