నా కథల గురించే కాదు, నా గురించి కూడా కాస్త..

—————————————————————————————————————————

నా పురిటి గడ్డ నెల్లూరు విజయ మహల్ సెంటర్. కానీ వారు వంజారి కృష్ణమూర్తి వృత్తిరీత్యా, హైదరాబాదులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. దాంతో నెల్లూరు నుండి మా మకాం మారింది .మాకు ఇద్దరు పిల్లలు ఇద్దరూ ఇంజినీర్లు గా పని చేస్తున్నారు.నాకు కథలు అంటే చిన్నతనం నుంచి ఆసక్తి . బహుశ అమ్మమ్మ, నాన్నమ్మలు చెప్పిన కథల కాలం మరి రాకుమారుడు వేటకు వెళ్లి ఏడు చేపలు తెచ్చారని చెబితే రాకుమారుడు వేటకు వెళ్ళితే సింహాలను కదా వేటాడేది. చేపలు తేవడం ఏమిటి. చేపలు ఎండక పోవడం ఏంటి. గడ్డి మోపు అడ్డం వస్తే మాత్రం, ఇలాంటి ప్రశ్నలు చిన్నతనం నుంచి బుర్రలో కదలాడుతుండేవి. ఏ కథ విన్నా తర్కించడం వాస్తవం కాదే అని ఆలోచనలు ప్రారంభమయ్యాయి.

కానీ డిగ్రీ చేరినప్పటి నుంచి నా ఆలోచనలు మారుతూ, ఒక గమనం వైపు నడిపించాయి. దానికి కారణం పద్మావతి గ్రంథాలయం . సాయంత్రాలు కాలేజీ అయినాక కే. వి. ఆర్. పెట్రోల్ బంకు దగ్గర బస్సు ఎక్కి గాంధీ బొమ్మ దగ్గర దిగి తిన్నగా ఇంటికి వెళ్లకుండా , ఇంటికి నడిచివెళ్లే దారిలో సండే మార్కెట్ దగ్గరున్న ఈ గ్రంథాలయంలో ప్రతి రోజు రెండు గంటలు చదువుకుని వెళ్లేదాన్ని అక్కడే చలం, రంగనాయకమ్మ మొదలు మల్లాది, ఎన్ ఆర్ నంది వరకు వార, మాస పత్రికలలోని కథలు వందల సంఖ్యలో చదివాను . అలా చదువుకునే రోజుల్లోనే రాసిన “ఆభాగ్యుడు ” అనే నా తొలి కవిత ఆంధ్రభూమిలో ప్రచురితమైంది. అప్పటి వారి కవితలు, వ్యాసాలు, భక్తి రచనలు, సమీక్షలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
సైన్సు టీచరుగా గా వృత్తి, వివాహం, కుటుంబ భాద్యతలు, జీవన పయనంలో ఎదురైనా అనేకానేక సమస్యల వల్ల కొంత కాలం రచన వ్యాసంగం లో విరామం తీసుకున్నాను . అయినా ఉద్యోగ బాధ్యతల్లో సడలింపు , శ్రీవారు కృష్ణమూర్తి, పిల్లలు వాళ్ళ వృత్తి లో స్థిరపడడం జరిగాక, రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాను.

నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో ఇరవై కథలదాకా ప్రచురితం అయినాయి. ప్రచురణకు ఎన్నికైన కథలు ఇంకా కొన్ని ఉన్నాయి. నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను. కథలు జీవితంలో నుంచి రావాలని, ఊహా సంఘటనలు అభూత కల్పనలు, నేల విడిచిన సంఘటనలు తాత్కాలిక ఆనందమే కానీ పాఠకుల మనసులో కానీ , కదా సాహిత్యంలో కూడా చిరకాలం నిలబడలేవు. అందుకే వ్యక్తులను , కుటుంబాన్ని, జీవితాలను, సమాజాన్ని సంస్కరించాలనే కథా ప్రయోజనాన్ని ట్రంకు రోడ్డు గ్రంథాలయంలో గుర్తెరిగాను .పెద్దల సాహిత్యం నాకు ప్రేరణగా నిలిచి ఆ వైపు నడిపిస్తుంది. ప్రయోజనం లేని కథ నిరుపయోగమే అని నా అభిప్రాయం చెప్పగలను. అంటూ ఆమె ముగించారు.

నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో యాభై కథలదాకా ప్రచురితం అయినాయి. . నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను.
guest
2 Comments
Inline Feedbacks
View all comments
Khaja mohiddin
Khaja mohiddin
May 24, 2020 5:40 pm

Hi… Madam
Ur from Nellore… Ohh

కిరణ్ చిటికెన
కిరణ్ చిటికెన
September 10, 2020 4:54 am
Reply to  Khaja mohiddin

నమస్తే