“సృజన ప్రియ” మార్చి నెల మహిళా దినోత్సవ ప్రత్యేక సంచిక లో నేను రాసిన కవిత “నువ్వే నువ్వే”. శ్రీ నీలం దయానంద రాజు గారికి, శ్రీ విల్సన్ రావు కొమ్మవారపు గారికి ప్రత్యేక ధన్యవాదాలతో..🙏🌹
నువ్వంటే నువ్వే
నువ్వంటే స్వేచ్చే ఇక..
పంజరాన్ని వీడి రెక్కలు చాపి
నింగికెగురుతున్న విహంగమే నువ్విక..
నిన్ను నిలువరించే శక్తుల
కుయుక్తులన్నీ మిధ్యే ఇక..
కొన్ని పువ్వులు నేలరాలిపోవచ్చు
మరికొన్ని తారకలు నింగికెగియవచ్చు..
నేల రాలిన పూలు నేర్పిన పాఠాలు
ఆత్మరక్షక కవచాలై దిశదిశలా వ్యాపిస్తాయి ఇక..
నింగికెగిసిన తారకల మెరుపు సందేశాలు
చిక్కబడ్డ చీకటిలోనైనా నిర్భయరాగాలై
నీలో కోటిఆశల వెలుగులను నింపుతాయి ఇక..
ఓర్పు, సహనం, ప్రేమ నీ సహజ ఆభరణాలు
దైర్యం,ఆత్మబలం,పోరాడి సాధించే గెలుపు
నీ అమ్ములపొదిలో ఉండవలసిన బాణాలు ఇక..
మహిళా..నువ్వెంటే నువ్వే ఇక
నిరంతరం విజయఢంకా మ్రోగించాలి నువ్విక..