నువ్వు

“తెలుగు సొగసు” ఆన్లైన్ పత్రిక మహిళా దినోత్సవ ప్రత్యేక సంచిక లో ప్రచురితం అయిన నా కవిత “నువ్వు “. శ్రీ సుధామ గారికి, శ్రీ దాసరి చంద్రయ్య గారికి ధన్యవాదాలతో..🌹🌹🙏🙏

నువ్వు
నువ్వంటే నువ్వే
నీలో ద్వంద్వార్ధాలు ఇక లేవు
విధవనో, వేశ్యనో,పతితనో
ఇంతవరకు నిన్ను చూపిన
ఆనవాళ్లను చెరిపేయాలి నువ్వు
తాళిబొట్టో,హిజాబో ఏదైనా సరే
నిన్ను బంధించే పంజరాలను
ఇక బద్దలు కొట్టాలి నువ్వు
ఆత్మాభిమానం నీ ఆయుధం
మనో నిబ్బరం నీ ఆత్మబలం
ఆత్మరక్షణ నీ ప్రాచీన హక్కు
నువ్వు చల్లగా దీవించే తల్లివి
మమతలు పంచే చెల్లివి
అనురాగపు విత్తనాలు చల్లి
ప్రేమను పండించే నెలతవి
నీ మానప్రాణాలను హరించే
దుష్టశక్తులను అంతమొందించే
మృత్యుదాతవు కూడా ఇక నువ్వే..
నువ్వెప్పుడూ నువ్వే ఇక..

Leave a Comment