నేను వ్రాసిన క్రింది కవిత “తియ్యదనంమాలిక అంతర్జాల పత్రికలో ప్రచురింపబడినది. చదివి మీ అభిప్రాయాలు తెలియజేయు ప్రార్ధన.

————————————————————————————————————————-

కెజియా వచ్చి ప్రార్థన చేసిన
కేకు తెచ్చి ఇచ్చింది…
రంజాన్ నాడు రజియా వచ్చి షీర్ కుర్మా
రుచి చూడమంది…
దసరా పండుగ నాడు
విజయ వచ్చి అమ్మ వారి
ప్రసాదం చక్కెర పొంగలి
తెచ్చి నోట్లో పెట్టింది…
అన్నింటిలోనూ ఒకటే
తియ్యదనం…
అదే మనందరినీ కలిపే
మానవత్వం…
అనురాగపు వెల్లువలో
అందరం తడిసి
మురిసే వేళ, మనకెందుకీ కులమతాల గోల…

నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో యాభై కథలదాకా ప్రచురితం అయినాయి. . నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను.
guest
0 Comments
Inline Feedbacks
View all comments