అక్షరాల తోవ వారి పోటీలో ఎన్నికైన నా కవిత
అమ్మ ఒడి తొలి పెన్నిది శిశువుకు
ఒడినుంచి అడుగేసే మజిలీ గుడిలాంటి బడి
మదిలో జ్ఞాన జ్యోతిని వెలిగించే నిధి
విజ్ఞానానికి బాటలు వేసే గురువు సన్నిధి
అ అంటే అమ్మ ఆ అంటే ఆవు
అక్షరాలేకాదు పదాలే కాదు
వ్యక్తిత్వ వికాసానికి
నీతిమార్గం చెప్పే పెద్దబాల శిక్ష గురువుమాట
అపాయాన్ని ఉపాయంతో తప్పించే
చందమామ కథ గురువు పలుకు
అలిసిన చిన్నారి మనసులకు
ఊరటనిచ్చే క్రీడాప్రాంగణం గురువు మనసు
ఉద్యానవనం బడి అయితే పిల్లలంతా పూలచెట్లు
పాదులుచేసి నీరుపెట్టి కాపాడే తోటమాలి గురువు
తాను నేర్పిన జ్ఞానపరిమళాలను
పువ్వుల్లా వ్యాప్తిచేసే చిన్నారుల మనసు గెలిచే
మహారాజు చదువుచెప్పే గురువు
అమ్మ నాన్నల తర్వాతి స్థానం
దైవం కంటే ముందు పొందిన గౌరవం
“ఆచార్య దేవోభవా” అన్న సూక్తి
ప్రతి శిశువు నోటా పలకాల్సిన తొలి పాఠం