కాక్టెయిల్

మరణమెప్పుడూ సంతోషకరం కాదు
చిలక గూటినుంచి ఎగిరిపోగానే
ఖననమో,దహనమో,పుటమో
చేసేస్తాము గూటిని భౌతికంగా
బూడిదో, ఎముకలో ఏదో ఒక
రూపంలో కలిసిపోతాయి
పాంచ భౌతికలతో..
పోయినవారు తిరిగిరారని తెలిసినా
కొందరు గగ్గోలు పెట్టి ఏడుస్తారు
కొందరు తలలు బాదుకుంటారు
కొందరు మౌనంగా రోదిస్తారు
మరికొందరు మంచు గడ్డలా మారతారు
కొందరు పోయినవారి వెంటే
పోవాలన్నంత హడావిడి చేస్తారు
మనుషులంతా రకరకాలు కాక్టైల్లాగా..
కానీ మరలిపోయిన మనిషి కోసం
గుండె సముద్రం నుంచి
రెండు కన్నీటి బొట్లు రాల్చని
కఠిన శిలలు కూడా ఉంటాయా?
ఏమో మరి మనుషులంతా
రకరకాలు కదా కాక్టైలాగా..

Leave a Comment