Home విజయ మహల్ సెంటర్ కథలు

విజయ మహల్ సెంటర్ కథలు

ఇప్పుడు నరసమ్మ నా కళ్ళముందు కనిపిస్తే గుండెలకు హత్తుకుని, పన్నీరు, నా కన్నీరు కలిపి ఆమె పాదాలను కడిగి నెత్తిన చల్లుకోవాలని ఉంది. ఎందుకో తెలియాలంటే ఈ నెల విశాలాక్షి మాసపత్రికలో ప్రచురితం అయిన నా "దొడ్డేత్తే నరసమ్మ" కథ చదవాల్సిందే. విజయమహల్ సెంటర్ కథలు విశాలాక్షి పత్రికలో ప్రచురిస్తూ గొప్ప ప్రోత్సహం ఇస్తున్న శ్రీ కోసూరు రత్నం గారికి, శ్రీ ఈతకోట సుబ్బారావు గారికి శిరస్సు వంచి వందనాలు. హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక పోయిన నెల నేను రాసిన "బాపనోల్ల పిల్ల-ముత్తరాశి యానాది పిలగాడు",...
రేపు "వాలెంటైన్స్ డే" కదా. ప్రేమికుల దినోత్సవం. మరి ప్రేమంటే వలపా..?ఆకర్షణ..?ఒకరివెనుక ఒకరు తిరగడమా..? గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ, హోటల్స్, పార్కుల వెంట తిరగడమా..? ఆసిడ్ దాడా..? హత్యో, ఆత్మహత్యో చేసుకోవడమా..? ఏం చేస్తున్నారు ఇప్పటి ప్రేమికులు..? కానీ ప్రేమంటే కాలం ఎంత మారినా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత దూరంగా ఉన్నా అనుక్షణం నీ వెంటే నేను, నీ తోడుగా నేను, నీ నీడగా నేను, నీ సంతోషమే నేను కోరుకునేది అనే భరోసా జీవితాంతం కలిగించడం.మొత్తంగా ప్రేమంటే ఇవ్వడమే..దాదాపు 35 ఏళ్ళ...
వీధుల్లో తోపుడు బండ్లమీద, పండ్ల అంగళ్ళల్లో చూసి తృప్తి పడడమే కానీ ఆపిల్ పండు కొనుక్కుని తినే ఆర్ధిక స్తోమత నా చిన్నప్పుడు మాకు లేదు. ఆపిల్ పండు తినాలనేది నా తీరని ఆశ అప్పుడు. అయితే ఓ జనవరి ఫస్ట్ రోజు ఏం జరిగింది,ఆపిల్ పండు తినాలనే నా కోరిక తీరిందా, లేదా అనేది ఈ నెల విశాలాక్షి మాసపత్రికలో వచ్చిన " దేవత అయిన రెడ్డెమ్మ" కథలో. సంపాదకులు శ్రీ కోసూరు రత్నం, శ్రీ ఈతకోట సుబ్బారావు గార్లకు ధన్యవాదాలతో.ఈ...
ఆరవ తరగతిలో తొలిసారి బడిలో చేరిన తొలిరోజు "యేసయ్య" గురించి తెలుసుకున్న బుజ్జమ్మ చెప్పిన కథ "తట్టుడీ మీకు టీయబడును", ఈ నెల విశాలాక్షి మాసపత్రికలో. శ్రీ కోసూరి రత్నం సర్, శ్రీ ఈతకోట సుబ్బారావు సార్లకి ధన్యవాదాలతో. మిత్రులకు ముందస్తు "క్రిస్మస్" పండుగ శుభాకాంక్షలతో..🎄🎄🙏🙏 "ఆగండి మీ" పెద్దగా ఉరుము ఉరిమినట్లు ఇనబడిన అరుపుకి ముందుకేయబోయిన నా అడుగు ఎనక్కి పడింది. అసెంబ్లీ హాలు ముందర బిత్తరపోయి నిలబడుకోనున్నాం నేను, రజియా, హిమబిందు. " మీరు గుడి కాడికి...
ఈ నెల విశాలాక్షి మాసపత్రికలో ప్రచురితం అయిన నా కథ "ఒక బాలనాగమ్మ -నలుగురు మాయల పకీర్లు". శ్రీ ఈతకోట సుబ్బారావు గారికి ధన్యవాదాలతో. మిత్రులకు దసరా శుభాకాంక్షలతో..దసరా కథ..🌹🌹🙏🙏కథను చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపగోరుతూ..🌹🌹🙏🙏 బడి బయట ఉండుండి తప్పేట్లు గొట్టే శబ్దం వస్తా ఉండాది." పది రోజులు సెలవులిచ్చినారు కదా అని వీధుల్లో పడి బలాదూరుగా తిరగబాకండి. ఇంటికాడనే ఉండి సుమతి శతకాలు, వేమన పద్యాలు కంఠతా పట్టండి. సెలవులు అయినంక శతకాల పోటీ పెడతాను నేను "...

స్కైలాబ్

దీని పాసుగల..స్కైల్యాబ్ పడి అందరం సచ్చిపోతాం అంట😨. అందరిని ఎంత బెదరగొట్టేస్తోందో ఈ స్కైలాబ్. ఏమా స్కైలాబ్ కథా..కమామీషు..స్కైలాబ్ మందల తెలియాలంటే ఈ నెల విశాలాక్షిలో బుజ్జమ్మ చెప్పే స్కైలాబ్ కథ చూడాల్సిందే. శ్రీ ఈతకోటసుబ్బారావు గారికి ధన్యవాదాలతో🙏🌹… "పాండు రంగడే మనకు తోడుగా పండారిపురమున ఉన్నాడుగా. రంగయ్య..పాండు రంగయ్య". బడి కాడ నించి నాలుగడుగులు వేసానో లేదో పెద్దగా పాట ఇనిపిస్తా ఉండాది."ఐ… ఇంటి ముందర సెంటర్ కాడికి పండరి భజన వొళ్ళు వొచ్చినట్లు ఉండారు" అనుకుంటా ఇంటికాడికి లగెత్తుకుంటా పోయినాను.మా ఇంటికి...
నమస్తే. ఈ నెల విశాలాక్షి మాసపత్రికలో నా కథ "కుడుములు సామి" ప్రచురితం అయింది. సంపాదకులు శ్రీ ఈతకోట సుబ్బారావు గారికి ధన్యవాదాలతో. కథని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపగోరుతూ.. బడి కాడ నుంచి ఇంటికి వస్తానే వాకిట్లో నల్ల కిర్రు చెప్పులు ఔపడ్డాయి నాకు. అంటే ఊరి కాడ్నించి రమణయ్య వొచ్చాడన్నమాట. ఇంట్లోకి పోయి చూస్తే నా ఊహ నిజమే. రమణయ్య, నాయిన మాట్లాడుకుంటా టీ తాగతా ఉండారు.నన్ను చూస్తానే రమణయ్య " రారా బుజ్జమ్మా..ఊరి కాడ్నించి నీ కోసం తాటి...
అబ్బయ్యా..అక్కా. . మా బడికాడి కుందేళ్ళ మందల చెప్తానన్నా కదా. మరి ఈ నెల విశాలాక్షి మాసపత్రికలో "ఆనంద భైరవి" కత చదవండి. మీకు తెలస్తది. అట్నే నన్ను ప్రోత్సహిస్తున్న శ్రీ కోసూరి రత్నం సారుకి, శ్రీ ఈతకోటసుబ్బారావు సారుకి ధన్నివాదాలు. కతని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు చెప్తారుగా రాత్రి తొమ్మిదైంది. ఆ పొయిలప్పుడు మోహనన్న ఫ్రెండ్ మురళి ఇంటికొచ్చాడు. పంచలో చేరి ఇద్దరు గుసగుసలాడుకుంటా ఉండారు. అమ్మ కుంపట్లో బొగ్గుల మీద నీళ్ళు చల్లి ఆర్పతా ఉండాది. నాయన...
అబ్బయ్య, అమ్మి ..మూడేళ్ళ పసివాడు "సునీలు ఏమయ్యాడో" . ఆ మందల తెలియాలంటే మీరు ఓ తూరి నెల్లూరు విజయమహల్ సెంటర్ కాడికి వెళ్లాల్సిందే మరి.. విశాలాక్షి మాసపత్రిక జూన్ 2021 సంచికలో.. "బాటలకు ఇరువైపులా చెట్లు నాటించిన చక్రవర్తి …. " ఆఖరి ఖాళీలో "అశోకుడు" అని రాసి "అమ్మయ్య" అనుకున్నా. క్లాసులో ఎనక కూర్చొని రాస్తావున్న ఆ అమ్మి హిమబిందు మెల్లగా " రాసేసావా. అయిపోయిందా" అంటా సైగ చేసింది. రాసేశా అంటా తలవూపినా. యూనిట్ పరీక్షల్లో ఆఖరి సోషల్ పరీక్షా...
కరోనా కరోనా అంటూ ఎప్పుడూ భయపడడం, బాధ పడడమేనా. ధైర్యమే మన ఆయుధం. కాస్త రిలాక్స్ కోసం ఈ రోజు నా కథ "అందమైన గాజులు" చదవండి మిత్రులారా. ఈ నెల విశాలాక్షి మాసపత్రికలో. బడి కాడనించి వస్తానే పుస్తకాల పెట్టిని మంచం మీదకు ఇసిరేసి అమ్మ ఇచ్చిన మురుకులు తింటా ఉన్నాను. కానీ నా మనసంతా వీధిలోనే ఉంది. ఆడుకునేదానికి వస్తామన్నారు సునీతా, రాధా. గబా గబా తినేసి అమ్మ పిలస్తా ఉన్నా ఆగకుండా ఇంటి వాకిలి తలుపు తీసుకుని ప్రహరీ...
నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో యాభై కథలదాకా ప్రచురితం అయినాయి. . నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను.