కడలి – అల

నమస్తే. ఈనాటి “నవతెలంగాణ సోపతి” లో నా కవిత “కడలి – అల”. సంపాదకులు శ్రీ కే. ఆనందాచారి గారికి ధన్యవాదాలతో.. కవితను చదివి మీ విలువైన అభిప్రాయాన్ని తెలుపగోరుతూ..

తను నీలాకాశం అయితే
నేను మెరిసే తారకనవుతా
తను కదిలే మేఘం అయితే
నేను పురివిప్పే మయూరమవుతా
తను కురిసే వర్షపు చినుకైతే
నేను మొలకెత్తే చిగురునవుతా
తను పోటెత్తే కడలి అయితే
నేను ఊరకలేసే అలనవుతా
తను పొదరిల్లు అయితే
నేను ఇంటిదీపాన్నవుతా
తను నా జీవితనౌక అయితే
నేను తనని నడిపే తెరచాపనవుతా
మేము ప్రతిరోజూ ఐ లవ్ యు చెప్పుకోము
గంటకోసారి లవ్ ఈమోజీలు పంపుకోము
పూలబొకేలు కానుకలు ఇచ్చుకోము
కోపాలు తాపాలు అలకలు బుజ్జగింతలు
ఇవే రోజు మేము ఇచ్చిపుచ్చుకునే కానుకలు
అయినా మేము ఒకరినినొదిలి ఒకరం ఉండలేం
ప్రతిరోజూ మాకు ప్రేమికుల రోజే
మేము అంటే ఇద్దరం
ఇద్దరం అంటే ఒక్కరమే
మేము ఇరువురం ఆలూమగలం
మేము నిత్య ప్రేమికులం

3 thoughts on “కడలి – అల”

  1. చాలా బాగుంది రోహిణి గారూ!
    ఇద్దరూ ప్రకృతియై… ఆకాశమొకరైతే తారకు ఒకరై, కురిసే వర్షమొకరైతే మొలకెత్తే చిగురొకరై…. బాగుంది మీ ప్రేమ కవిత.

    Reply
  2. This is an amazing message through your story. These will be an eye opening words to everyone. Thank you for such real stories so that everybody will come to know about the things which were happening in the society. Keep motivating us with your stories

    Reply

Leave a Comment