ఆరోగ్యమే ఆనందం – 8

మిత్రులకు సాహో అందించే మరో ఆరోగ్య కానుక. సాహూ మార్చి నెల సంచికలో “పశ్చిమోత్తాసనం” మీ కోసం

“ఆజానుబాహుడంట అమ్మలాలో” పాట వినేవుంటారు. తీరైన భుజాల ఆకృతి ఉన్నవాళ్ళకి ఇచ్చే ఒక ప్రశంస అది. ఇప్పుడు, ఈ ఊరుకులపరుగుల యుగంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరికీ ఏదో ఒక ఆరోగ్య సమస్య. పోషకాహార లోపం. ముప్పై ఏళ్లలోపే ఎముకలు అరిగిపోవడం, త్వరగా అలిసిపోవడం. మెడ, భుజాల్లో తీవ్రమైన నొప్పి. ఇక తీరైన దేహ ఆకృతి అటుంచి, చక్కని ఆరోగ్యం అందని ద్రాక్షపండే అవుతోంది ఇప్పుడు. ఇలాంటి సమస్యల నివారణకు అద్భుతమైన యోగాసనం గురించి ఈ నెల మనం తెలుసుకోబోతున్నాం. చక్కని ఆరోగ్యానికి, ఆకృతికి మనం రోజు వేయాల్సిన యోగాసనం “భుజంగాసనం”.
భుజంగాసనం వేయాల్సిన విధానం
౧. ప్రశాంతమైన వాతావరణంలో అంటే మన గదిలో అయినా సరే చక్కని ప్రదేశంలో యోగా మాట్ మీదా ముందుగా బోర్లా పడుకోవాలి.
౨. అరచేతులను భుజాలక్రింద నేలమీద ఉంచి నెమ్మదిగా గాలిపీలుస్తూ, చేతుల ఆధారంతో శరీరాన్ని పైకి లేపాలి. పొట్ట పైభాగం వరకు లేపాలి.
త్రీ. చేతులను నిటారుగా ఉంచాలి.
౪. నెమ్మదిగా తలను వీలైనంత వెనక్కి వంచాలి. ఈ విధంగా ఉండగలిగినంతసేపు ఉండి,
నెమ్మదిగా గాలి పీల్చుతూ వదులుతూ ఉండాలి.
౫. ఇదేవిధంగా చేతులను వీపుమీద ఉంచి లేదా మెడ మీద పెట్టి శరీరాన్ని పైకి లేపాలి.
భుజంగాసనం వల్ల లాభాలు.
౧. నడుం నొప్పి నివారణకు దివ్యమైన ఆసనం ఇది
౨. జీర్ణక్రియ బలం పెరుగుతుంది. ఉదరంలో జీర్ణరసాలు చక్కగా విడుదల అవుతాయి. ఆకలి పెరుగుతుంది.
త్రీ. మూత్రపిండాలు సమర్ధవంతంగా పనిచేస్తాయి.
౪. ఋతు సంబంధమైన సమస్యలను భుజంగాసనం వేయడంవల్ల సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చు.
౬. భుజంగం అంటే పాము. ఈ ఆసనం వేసినప్పుడు శరీరం పడగ ఎత్తిన పాములాగా సాగుతుంది. చక్కటి శరీర ఆకృతి కూడా మన సొంతం అవుతుంది.
ఇన్ని ఉపయోగాలు ఉన్న భుజంగాసనం వేయడం కూడా చాల తేలిక. మరికెందుకు ఆలస్యం. భుజంగాసనం ప్రతిరోజూ సాధన చేసి చక్కటి ఆరోగ్యాన్ని, అందాన్ని, ఆనందాన్ని సొంతం చేసుకుందామా.
మరో రెండు బోనస్ చిట్కాలు
౧. చలి తగ్గి ఎండలు ముదిరేకాలం ఇది. సున్నితమైన చర్మం వాతావరణ మార్పులను తట్టుకోవడానికి చాల అనుకూలనాలు ఏర్పరచుకోవాల్సిన సమయం. చిరుచలి, ఎండ, దుమ్ముధూళి కలసి కాస్త చర్మం చిరచిరలాడవచ్చు. కనీసం వారానికి రెండుసార్లు అయినా నువ్వులనూనెలో పసుపు వేసుకుని చర్మానికి బాగా మర్దన చేసుకోవాలి. నువ్వుల నూనె చర్మంలోకి ఇంకెలా అర్ధగంట వదిలేయాలి. తర్వాత సెనగపిండితో ఒళ్ళు రుద్దుకుని గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే, చర్మ గ్రంథులన్నీ శుభ్రపడి, బలపడి,చర్మం నూతన యవ్వనాన్ని సంతరించుకుంటుంది.
౨. కొబ్బరి కాయ కొట్టి, వాడడానికి ఓపికలేక ఫ్రిడ్జిలో పెట్టేస్తుంటారు కొందరు. ఫ్రిడ్జ్ నిండా కొబ్బరి చిప్పలతో నిండిపోతుంది. పదిరోజుల్లో చిప్పలు ఎరుపు తిరిగి పాడైపోతాయి. కొబ్బరి చిప్పలను ఎండబెట్టి నూనె గానుగలో ఇవ్వొచ్చు. లేదా డీప్ ఫ్రిడ్జిలో పెడితే చాలారోజులు నిల్వ ఉంటాయి. అయితే డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీసినవెంటనే వాడేయాలి. తర్వాత ఇక నిలవుండవు.

Leave a Comment