అందం

క్రింది కవిత “అందం” విశాలాక్షి మాస పత్రికలో ప్రచురింపబడింది. చదివి మీ అభిప్రాయాలు తెలియజేయు ప్రార్ధన.

————————————————————————————————————————-

ముఖం మీద ఒక్క ముడత్తెనా ఉండకూడదు..
ఒక్క మచ్చ అయినా కనిపించకూడదు
ఆరెంజ్ పీల్ ప్యాక్, ముల్తానీ ఫేస్ ప్యాక్,
ఆరు పొరల మందాన మేకప్ క్రీం వేసినా..
చిరునవ్వు ఆభరణంగా
లేని ముఖారవిందానికి వ్యర్థమేగా…
అరచేతినించి మోచేతిదాక
గాజులు ధరించినా
ఆ చేతికి,సాయమడిగే
మరోచేతికి చేయూతనీయకపోతే
ఆ గాజుల సవ్వడి
వ్యర్థమేగా..
ముడతలు పడిన మెడనించీ, హ్రుదయందాక
ధరించిన సువర్ణ హారం
నలుగురిలో మన అంతస్తుని చూపిస్తుంది
కానీ, హ్రుదయ సౌందర్యాన్ని చూపే
ఆభరణమేది..
హ్రుదయం నిండుగా
జాలి,దయ,కరుణ, సేవ
గుణాలు ఉండడమే
అసలైన హ్రుదయ
సౌందర్యం అయితే
“మధర్ థేరీసా”కన్నా
గొప్ప అందగత్తె ఎవరు
ఉన్నారు ఈ లోకంలో
చెప్పండి మీరు..