కధలు

విదిశ

నమస్తే. “దిశ” ఘటన దేశాన్ని ఎంత కలవరపరిచిందో అందరికి తెలుసు. నేరస్తులకు శిక్ష పడిన తర్వాత కూడా ఇటువంటి నేరాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు అభ్యుదయవాదులం అనుకునేవారు ప్రతి సంఘటనకి కులం, మతం రంగులద్ది నిందితులను అన్యాయంగా శిక్షించారు అంటూ ఎలుగెత్తారు. కానీ సమస్య తమదాకా వస్తేనే కదా బాధ తెలిసేది. ” దిశ” ఘటన నేపథ్యంలో స్త్రీల సమస్యల ఇతివృతంతో ” అర్చన పైన్ఆర్ట్స్ అకాడమీ [హ్యూస్టన్ ] ” వారు కథల పోటీ నిర్వహించడం …

విదిశ Read More »

విజేత

నమస్తే! నేను రాసిన ఈ కథ “విజేత” సమన్విత / ఐద్వా / కోపూరి ట్రస్ట్ సమ్యుక్తంగా నిర్వహించిన ట్రాన్స్ జెండర్లపై కథానికల సంకలనం “అస్మిత” లో చోటు చేసుకుంది. మాడా గాడు, తేడా గాడు, పాయింట్ ఫైవ్, కొజ్జా, చెక్క గాడు ఎన్ని రకాలుగా అవహేళనలు చేసే ఈ లోకంలో ఓ ట్రాన్స్ జెండర్ మనిషి తన జీవితంలో ఎలా విజయం సాధించాడో తెలిపే కథ ఈ “విజేత“. మీరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయం …

విజేత Read More »

భరోసా

నమస్తే! ప్రజాశక్తి స్నేహ బుక్ లో నేను రాసిన బాలల కథ “భరోసా” ప్రచురితం అయింది. చదివి మీ అమూల్యమైన అభిప్రాయం తెలుపండి. ఆ పిల్లల లాగే మనం కూడా కరోనా బాధితులకు భరోసా ఇద్దామా మరి. ————————————————————————————————————————— బడి గంట కొట్టగానే తెలుగు మాస్టర్ జయరాజు ఆరవ తరగతి గదిలోకి ప్రవేశించారు. అప్పటిదాకా బల్లల మీద ఎక్కి గోల గోలగా ఆరుస్తున్న పిల్లలంతా ఎవరి చోటుకు వారు వెళ్ళి మాస్టారుకు నమస్కారం చేసి నిశ్శబ్దంగా కూర్చున్నారు. …

భరోసా Read More »

ఆసరా

నమస్తే! ఈ కథ నవ్య వీక్లీ -రచయిత్రి శ్రీమతి కమలారాంజీ సంయుక్తంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఉగాది కథల పోటీలో రూ. 5000 బహుమతి పొందినది. మేము గూడూరులో ఉన్నపుడు మాకు రుచి ఫాస్ట్ ఫుడ్స్ అని హోటల్ ఉండేది. ఈ కథ మా ఇంటివెనుక ఇంట్లో ఉన్న తల్లీకొడుకుల ధీన గాధ. మా హోటల్ దగ్గర, మా ఇంటి వెనుక ఇంట్లో జరిగిన యదార్ధ సంఘటనలే ఈ “ఆసరా” కథకు ప్రేరణ. కథను చదివి మీ అమూల్యమైన …

ఆసరా Read More »

నల్ల సూరీడు

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “నల్ల సూరీడు”  జూలై 2019 లో “విశాలాక్షి” మాస పత్రికలో ప్రచురితం అయింది. “మతం కన్నా మానవత్వం మిన్న” అనే నేపధ్యం లో నా కళ్ళ ముందు జరిగిన సంఘటనలను కథగా మలిచాను. ఈ కథకి “మక్కెన రామ సుబ్బయ్య స్మారక & విశాలాక్షి సాహితీ మాస పత్రిక” నిర్వహించిన కథల పోటీలో తృతీయ బహుమతి ని పొందాను. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. ————————————————————————————————————————– …

నల్ల సూరీడు Read More »

దత్తత ఫలం

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “దత్తత ఫలం”  “ప్రియమైన రచయితల నూరు కథల సంకలనం” లో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. ————————————————————————————————————————— “అమ్మకు సీరియస్ గా ఉంది వెంటనే బయలుదేరండి” అని బావగారి వద్దనుంచి ఫోన్ రావటంతోనే ఆయన డీలా పడిపోయారు. ఓ ప్రక్క ఆయన్ను అనునయిస్తూనే కర్తవ్యాన్ని గుర్తెరిగిన నేను రైల్వే రిజర్వేషన్ కోసం చూసాను.ఏ ట్రైన్ లో దొరకలేదు. ఇక తప్పదని కేశినేని ట్రావల్స్ …

దత్తత ఫలం Read More »

డ్రైవరో నారాయణో హరి

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “డ్రైవరో నారాయణో హరి”  నవంబర్ 2019 “హ్యూమర్ టూన్స్” పత్రికలో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. —————————————————————————————————————————– ఓర్నాయనో” గావుకేక పెట్టి కుర్చీ లోంచి ఇరగదీసుకుని కింద పడిపోయాడు పుల్లారావు. నేలమీదపడి దొర్లుతూ తిరిగి తిరిగి ఆగిపోయిన బొంగరంలా చేష్టలుడిగి, ఉలుకు పలుకు లేకుండా చచ్చిన శవం మాదిరి బిగుసుకుపోయాడు. పుల్లారావు అరచిన అరుపుకి భూ కోపం వచ్చినట్లుగా ఆఫీసంతా దద్దరిల్లి పోయి …

డ్రైవరో నారాయణో హరి Read More »

ఇచ్చుటలోని ఆనందం

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “ఇచుటలోని ఆనందం”  జనవరి 2019 “ఉషోదయ వెలుగు” పత్రికలో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. —————————————————————————————————————————– రాత్రి ఆలస్యంగా నిద్రపోయినా, పొద్దున లేచేసరికి ఏడు గంటలయ్యింది. అలా నిద్ర కళ్ళతోనే నడుస్తూ వచ్చి డైనింగ్ టేబుల్ వైపు చూచి ఉలిక్కిపడ్డాను. టేబుల్ మీద పెద్ద సైజు పుల్లారెడ్డి స్వీట్ల ప్యాకెట్టు దర్శనమిచ్చింది. రారమ్మంటూ ఊరిస్తూ.. ఓహో అప్పుడే మొదలైందన్నమాట, పండుగ రోజుల్లో మా …

ఇచ్చుటలోని ఆనందం Read More »

కృషి తో నాస్తి దుర్భిక్షం

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “కృషి తో నాస్తి దుర్భిక్షం”  9-12-2018 తేదీన “సాక్షి ఫండే” లో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. —————————————————————————————————————————- అది ఆరవ తరగతి గది. ఏం అవినాష్ నిన్న నువ్వు స్కూల్ కి ఎందుకు రాలేదు?” అడిగాడు సైన్స్ టీచర్ సుధాకర్ అవినాష్ వంక చూస్తూ, “సార్… మరి మన ఊర్లోకి ‘ఆనంద బాబా’ వచ్చారు. కదా! ఆయన్ని చూడ్డానికి మా గల్లీలో …

కృషి తో నాస్తి దుర్భిక్షం Read More »

మీ టూ

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “మీ టూ”  19-12-2018 తేదీన “నవ్య ” వార పత్రికలో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. —————————————————————————————————————————— జ్వాలా, తలనొప్పిగా ఉంది. కాస్త టీ పెట్టి ఇవ్వు” అంటూ ఇంట్లోకి వస్తూనే కుర్చీలో కూర్చుని తలపట్టుకున్నాడు శ్రీధర్ టీ చేతికందిస్తూ, ‘అయితే వెళ్ళినపని కాలేదన్నమాట. ఎక్కడా డబ్బు దొరకలేదాండీ” అంది జ్వాల. “లేదు జ్వాలా. యాభై వేలు కాదు కదా , కనీసం …

మీ టూ Read More »